Vivo X200 Series Launch : వివో కొత్త X200 సిరీస్ చూశారా? ఒకటి కాదు.. రెండు ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo X200 Series Launch : వివో ఎక్స్200 ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 65,999కు అందిస్తోంది. వివో ఎక్స్200ప్రో 16జీబీ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 94,999 ఖర్చవుతుంది.

Vivo X200 Series Launch : వివో కొత్త X200 సిరీస్ చూశారా? ఒకటి కాదు.. రెండు ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Vivo X200 Series Launched in India

Updated On : December 12, 2024 / 6:39 PM IST

Vivo X200 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వివో నుంచి ఎట్టకేలకు వివో X200 సిరీస్ వచ్చేసింది. వచ్చే నెలలో భారత్‌లో లాంచ్ కానున్న వన్‌ప్లస్13 వంటి వాటితో పోటీపడే అవకాశం ఉంది. వివో చైనాలో ప్రవేశపెట్టిన మినీ వేరియంట్ ఏదీ లేదు.

భారతీయ మార్కెట్ ప్రామాణిక, ప్రో వెర్షన్‌ను మాత్రమే కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లు ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ చిప్‌సెట్‌ను ఉపయోగిస్తాయి. వివో యూజర్ల నుంచి హై-ఎండ్ స్పెక్స్‌ను అందిస్తాయి. లేటెస్ట్ వివో ఎక్స్200 ఫోన్‌ల అధికారిక ధర, స్పెషిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో భారత్ ధర, లభ్యత :
వివో ఎక్స్200 ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 65,999కు అందిస్తోంది. వివో ఎక్స్200ప్రో 16జీబీ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 94,999 ఖర్చవుతుంది. ఈ ఫోన్లు అమెజాన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయానికి రానున్నాయి. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంపిక చేసిన కార్డ్ వినియోగదారులు వారి కొనుగోళ్లపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రెండు ఫోన్‌లు డిసెంబర్ 19, 2024 నుంచి విక్రయానికి రానున్నాయి.

వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో స్పెక్స్, ఫీచర్లు :
వివో ఎక్స్200 ఫోన్ 6.67-అంగుళాల 10-బిట్ ఓఎల్ఈడీ ఎల్‌టీపీఎస్ క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌తో పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్‌డీఆర్10+, 4,500 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,800mAh బ్యాటరీతో వస్తుంది. ఇతర చైనీస్ కంపెనీల మాదిరిగానే వివో కూడా రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందిస్తుంది. ప్రామాణిక వివో X200 మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ సెటప్ వినియోగదారులకు మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. వివో ఎక్స్200ప్రో స్టాండర్డ్ మోడల్‌తో సమానమైన డిస్‌ప్లేను అందిస్తుంది. అయితే, ఎల్‌టీపీఓ ప్యానెల్ 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, స్లిమ్మర్ 1.63ఎమ్ఎమ్ బెజెల్స్‌తో సహా కొన్ని అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది.

వివో ప్రో వేరియంట్‌లో 200ఎంపీ జీస్ ఏపీఓ టెలిఫోటో సెన్సార్ ఉంది. వివో వి3+ ఇమేజింగ్ చిప్‌కు సపోర్టును కలిగి ఉంది. 4కె హెచ్‌డీఆర్ సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియో, 60పీఎఫ్ఎస్ వద్ద 10-బిట్ లాగ్ వీడియో రికార్డింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లను అందిస్తుంది.

వివో ఎక్స్200ప్రో పెద్ద 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. వివో ఎక్స్200 సిరీస్‌లోని రెండు మోడల్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా 3ఎన్ఎమ్ ప్రాసెస్‌పై పనిచేస్తాయి. చిప్‌లో 3.6GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌తో కార్టెక్స్-X925 పెర్ఫార్మెన్స్ కోర్ కలిగి ఉంది.

Read Also : iPhone Data Transfer : ఐఫోన్ నుంచి పీసీ లేదా మ్యాక్‌కు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!