Vivo X300 Series : వివోనా మజాకా.. కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్..!

Vivo X300 Series : వివో నుంచి సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. వివో X300, వివో X300 ప్రో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. కీలక ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.

1/6Vivo X300 Series
Vivo X300 Series : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో వివో X300, వివో X 300 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనాలో ఆవిష్కరించింది. మీడియాటెక్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, జీఈఐఎస్ఎస్ ట్యూన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌లు, ప్రో-గ్రేడ్ ఫొటోగ్రఫీ కోసం వివో ఇన్-హౌస్ V3+ ఇమేజింగ్ చిప్ ఉన్నాయి.
2/6Vivo X300, X300 Pro
ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కంపెనీ లేటెస్ట్ ఆర్జిన్OS 6పై రన్ అవుతాయి. వివో ఇంకా భారత మార్కెట్లో లాంచ్ టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించలేదు. లీక్‌లను పరిశీలిస్తే.. డిసెంబర్ మధ్య నాటికి లాంచ్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
3/6Vivo X300, X300 Pro
వివో X300, X300 ప్రో భారత్ లాంచ్ తేదీ (అంచనా) : రిపోర్టులను పరిశీలిస్తే.. వివో X300, వివో X300 ప్రో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15, 2025 మధ్య భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కంపెనీ అధికారికంగా తేదీని ధృవీకరించలేదు. కానీ, డిసెంబర్ ప్రారంభంలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
4/6Vivo X300, X300 Pro
భారత్‌లో వివో X300, వివో X300 ప్రో ధర (అంచనా) : ధర విషయానికొస్తే.. వివో X300, వివో X300 ప్రో భారత మార్కెట్లో వరుసగా ధర రూ.69,999 నుంచి రూ.99,999 వరకు ఉండవచ్చు.
5/6Vivo X300, X300 Pro
వివో X300, X300 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) : ఈ రెండు ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 SoC ద్వారా పవర్ పొందుతాయి. ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పీడ్, పవర్ సామర్థ్యంతో వస్తుంది. ఈ వివో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో బీఓఈ క్యూ10 ప్లస్ ఓఎల్ఈడీ ఎల్టీపీఓ ప్యానెల్‌ కలిగి ఉంటాయి. అద్భుతమైన విజువల్స్, కస్టమైజడ్ రిఫ్రెష్ రేట్‌ అందిస్తాయి.
6/6Vivo X300 Series
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో X300 ఫోన్ 200MP శాంసంగ్ HPB ప్రైమరీ సెన్సార్‌ కలిగి ఉంది. అయితే, వివో X300 ప్రో 50MP సోనీ LYT-828 మెయిన్ లెన్స్‌ కలిగి ఉంది. ఈ రెండూ జీఈఐఎస్ఎస్ ఆప్టిక్స్ వి3+ ఇమేజింగ్ చిప్ ద్వారా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఫ్రంట్ సైడ్ రెండు మోడళ్లు 50MP సెల్ఫీ కెమెరాలతో వస్తాయి. బ్యాటరీ పరంగా కొద్దిగా వేరుగా ఉంటాయి. స్టాండర్డ్ మోడల్ విషయానికి వస్తే.. 6,040mAh, ప్రో మోడల్ కోసం 6,510mAh, రెండూ IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో రానుంది.