వివో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 7300mAh బ్యాటరీ.. అదుర్స్ కదా?
వివో Y300+ స్టార్ సిల్వర్, పింక్, సింపుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లతో వచ్చింది.

వివో నుంచి వై సిరీస్‌లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ Vivo Y300+ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేశారు. భారత్‌లో ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్న వివరాలు తెలియరాలేదు. భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, AMOLED డిస్‌ప్లే డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
ప్రస్తుతం చైనాలో Vivo Y300 Plus బేస్ 8GB/128GB మోడల్ ధర దాదాపు రూ. 21,200గా ఉంది. మరో మూడు కాన్ఫిగరేషన్‌లలోనూ ఇవి లభ్యమవుతున్నాయి.
Also Read: హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. ఇప్పుడైనా చల్లారేనా? ఏం జరుగుతోంది?
ఏ కాన్ఫిగరేషన్ ధర ఎంత?
- 8GB/256GB ధర సుమారు రూ.23,550
- 12GB/256GB ధర సుమారు రూ.25,900
- 12GB/512GB ధర సుమారు రూ.29,400
వివో Y300+ స్టార్ సిల్వర్, పింక్, సింపుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లతో వచ్చింది. ఏయే దేశాల్లో వివో వై 300 ప్లస్ ను తీసుకొస్తారన్న విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. Vivo Y300+ భారత్‌లో వేర్వేరు పేర్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనిని iQOO Z10, Vivo T4 5G పేర్లతో విడుదల చేయొచ్చు.
ఫీచర్లు
Vivo Y300+ అడ్రినో 810 గ్రాఫిక్స్‌తో పైర్‌తో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR4x RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300 mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది.
Vivo Y300+ 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 nits (1,300 nits HBM) పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఆప్టిక్స్ విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ సోనీ LYT-600 సెన్సార్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌తో రానుంది. 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఇందులో ఉంది. Y300 ప్లస్ f/2.0 ఎపర్చర్‌తో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 OriginOS 5తో విడులైంది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ షీల్డ్ టెంపర్డ్ గ్లాస్‌తో వచ్చింది.