IPL 2025: హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. ఇప్పుడైనా చల్లారేనా? ఏం జరుగుతోంది?
సమస్యను పరిష్కరించుకుందామంటూ హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్ మెయిల్ పంపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 జరుగుతోన్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీంతో హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్‌తో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది.
ప్రభుత్వం చర్చలకు పిలిచిందని హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్ మెయిల్ చేసింది. ఇప్పటికే ఉప్పల్ లో ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు రోహిత్ సురేశ్, కిరణ్ తో హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు చర్చలు జరిపారు. బుధవారం ఇరువర్గాలతో ప్రభుత్వం సమావేశం జరపనుంది. సమస్యను పరిష్కరించుకుందామంటూ హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్ మెయిల్ పంపింది.
Also Read: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు?
అసలు ఏం జరిగింది?
ఐపీఎల్ టికెట్లు, పాస్‌ల విషయంలో హెచ్‌సీఏ తమను వేధిస్తోందని ఇటీవల ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ నుంచి బెదింపులను ఎదుర్కొంటున్నట్లు హెచ్‌సీఏ కోశాధికారికి ఇటీవల సన్‌రైజర్స్ ప్రతినిధి లేఖ రాశారు.
దీంతో తాము ఆందోళన చెందినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం హెచ్‌సీఏకు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నామని వివరించారు. ఇందులో 50 సీట్ల కెపాసిటీ ఉన్న ఎఫ్ 12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా ఉన్నాయని చెప్పారు.
అయినప్పటికీ ఈ ఏడాది దాని కెపాసిటీ 30 మాత్రమేనని చెబుతూనే ఎక్స్‌ట్రాగా మరో 20 టికెట్లు కేటాయించాలని అడిగినట్లు తెలిపారు. గత మ్యాచ్ వేళ ఎఫ్ 3 బాక్సుకు లాక్ వేసినట్లు చెప్పారు.
చివరకు ఈ వివాదం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణకు విజిలెన్స్ అధికారులను ఆయన ఆదేశించారు. హెచ్‌సీఏ ప్రవర్తిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.