Vivo Y600 Pro : వివో లవర్స్ గెట్ రెడీ.. భారీ 10,000mAh బ్యాటరీతో వివో Y600 ప్రో వస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలు లీక్..!
Vivo Y600 Pro : వివో నుంచి భారీ 10,000mAh బ్యాటరీతో వివో Y600 ప్రో వచ్చేస్తోంది. మెయిన్ లెన్స్ 50MP ఉండవచ్చు. ఈ ఫోన్లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
Vivo Y600 Pro
- 10000mAh భారీ బ్యాటరీతో వివో Y600 ప్రో వస్తోంది
- వివో ఫోన్లో ఇదే అతిపెద్ద బ్యాటరీగా అంచనా
- కంపెనీ బ్యాక్ సైడ్ సర్కిల్ కెమెరా మాడ్యూల్ అందించనుంది
- ఈ ఫోన్లో 6.67 అంగుళాల OLED డిస్ప్లే ఉండొచ్చు
Vivo Y600 Pro : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. కొత్త వివో Y600 ప్రోను కంపెనీ టీజ్ చేసింది. అతి త్వరలో మార్కెట్లోకి ఈ ఫోన్ రానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్ కీలక ఫీచర్లను వెల్లడించింది. స్పెషల్ అట్రాక్షన్ బ్యాటరీ, 10,000mAh సామర్థ్యంతో వస్తుంది.
వివో ఫోన్లలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బ్యాటరీగా కంపెనీ పేర్కొంది. ఈ వివో ఫోన్ అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు పూర్తి వివరాలపై ఓసారి వివరంగా తెలుసుకుందాం..
వివో Y600 ప్రో త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ టీజర్లో ఈ ఫోన్ డిజైన్‌ను వెల్లడించింది. ఈ ఫోన్‌ను పర్పల్ కలర్ ఆప్షన్లలో టీజ్ చేశారు. ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీ బ్యాక్ సైడ్ సర్కిల్ కెమెరా మాడ్యూల్ అందించింది.
భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ :
గోల్డ్ కలర్ డెకరేషన్తో రానుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ లెన్స్ 50MP ఉండవచ్చు. ఈ ఫోన్లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది.
వివో Y600 ప్రో గత మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్లతో వస్తుందని భావిస్తున్నారు. 1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల OLED డిస్ప్లే ఉండవచ్చు. కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుందని అంచనా. ఈ ఫోన్ సన్నని బాడీతో వస్తుందని అంచనా. కంపెనీ గత మోడల్లో డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను వాడింది. ఈసారి అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.
వచ్చే మే నెలలో ఈ వివో ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. నివేదికలను పరిశీలిస్తే.. ధరల వివరాలు లీక్ చేశాయి. వివో Y600 ప్రో చైనాలో 1,799 యువాన్ల (సుమారు రూ. 24,000) ధరతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఇంకా అధికారికంగా ధరను ప్రకటించలేదు. ఈ ఫోన్ లాంచ్ తేదీ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు.
