Waterproof Phones
Waterproof Phones : అసలే వర్షాకాలం.. వర్షాలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటే కష్టమే. అందులోనూ జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడ వర్షంలో (Waterproof Phones) తడుస్తుందనే ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి వర్షాకాలం సమయంలో వర్షంలో తడిసినా చెక్కుచెదరని వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి.
మీరు కూడా అలాంటి వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. వర్షాన్ని తట్టుకోగల స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. భారత మార్కెట్లో అనేక వాటర్ ప్రూఫ్ ఆప్షన్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.20వేల లోపు ధరలో లభించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
ఒప్పో K13 :
ఒప్పో K13 ధర రూ.17,999కు పొందవచ్చు. పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు పవర్‌ఫుల్ 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంది.
ఐక్యూ Z 10R :
ఐక్యూ Z10R ఫోన్ ధర రూ.19,499కు లభిస్తుంది. భారీ 5700mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఐక్యూ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 8GB ర్యామ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
Read Also : Samsung Galaxy M35 5G : శాంసంగ్ గెలాక్సీ M35 5Gపై బిగ్ డిస్కౌంట్.. జస్ట్ రూ. 796 EMIతో ఇంటికి తెచ్చుకోవచ్చు!
మోటో G86 పవర్ :
మోటో G86 పవర్ ఫోన్ రూ.16,999 ధరకు లభిస్తుంది. 6720mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 6.7-అంగుళాల FHD+ p-OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 8GB ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
రియల్‌మి P3 :
రియల్‌మి P3 ఫోన్ ధర రూ.16,499కు పొందవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్ అందిస్తుంది.
షావోమీ రెడ్‌మి నోట్ 14 5G :
షావోమీ రెడ్‌మి నోట్ 14 5G ఫోన్ ధర రూ.16,999కు పొందవచ్చు. 5110mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ షావోమీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7020 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. 6GB ర్యామ్ కలిగి ఉంది.