వాట్సాప్‌లో కొత్త లాగౌట్ ఫీచర్… ఇకపై డిలీట్ అకౌంట్ ఆప్షన్ కనిపించదు!

వాట్సాప్‌లో కొత్త లాగౌట్ ఫీచర్… ఇకపై డిలీట్ అకౌంట్ ఆప్షన్ కనిపించదు!

Updated On : February 19, 2021 / 6:45 PM IST

WhatsApp New Log Out Feature for iOS : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లను తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను బీటా వెర్షన్ రిలీజ్ చేసింది.

ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఐఓఎస్ యూజర్ల‌ కోసం బీటా వెర్షన్ తీసుకొచ్చింది. వాట్సాప్ ఐఓఎస్ యూజర్లు తమ ఫోన్ పనిచేయకపోయినా అదే అకౌంటును మరో డివైజ్ లో వినియోగించుకోవచ్చు. అలానే వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ కూడా ప్రవేశపెడుతోంది. డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగౌట్ అనే ఫీచర్‌ తీసుకొస్తోంది. దీంతో వాట్సాప్ యూజర్లు వేరే డివైజ్‌లలో వాట్సాప్‌ లాగౌట్ చేయడం మర్చిపోతే ఈ ఫీచర్‌‌తో ఎక్కడి నుంచైనా లాగౌట్‌ చేయవచ్చు. దీని వీడియోను వాట్సాప్ బ్లాగ్‌లో షేర్ చేసింది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిట్, ఇమోజీ మొదలైనవి చేయవచ్చు.