WhatsAppలో కొత్త ఫీచర్.. ఒకే క్లిక్.. మీ చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు!

వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Whatsapp Chat History Transfer ఫీచర్.. మీ డేటాను సింగిల్ క్లిక్ తో ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. మీరు వాడే ఏదైనా డివైజ్ లోని వాట్సాప్ చాట్ డేటాను మరో డివైజ్ లోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. మీరు ఐఓఎస్ (iOS) డివైజ్ వాడుతున్నట్టయితే.. మీ ఆండ్రాయిడ్ (Android) డివైజ్ లోకి ఈజీగా చాట్ హిస్టరీ డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. 

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. Whatsapp Chat History Transfer ఫీచర్.. మీ డేటాను సింగిల్ క్లిక్ తో ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. మీరు వాడే ఏదైనా డివైజ్ లోని వాట్సాప్ చాట్ డేటాను మరో డివైజ్ లోకి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. మీరు ఐఓఎస్ (iOS) డివైజ్ వాడుతున్నట్టయితే.. మీ ఆండ్రాయిడ్ (Android) డివైజ్ లోకి ఈజీగా చాట్ హిస్టరీ డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ఇప్పటివరకూ వాట్సాప్ చాట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ (Third-party Apps) పై ఆధారపడాల్సి వచ్చేది. ఈ యాప్స్ ద్వారా ముందుగా డేటాను Cloudలోకి బ్యాకప్ తీసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాతే కొత్త డివైజ్ లోకి డేటాను డౌన్ లోడ్ చేసి ట్రాన్స్ ఫర్ చేసుకోను వీలుంది. ఈ ప్రక్రియ కారణంగా మీ విలువైన డేలా లీక్ లేదా డిలీట్ అయ్యే రిస్క్ ఉంది.

అందుకే వాట్సాప్ Chat History Transfer Feature తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ (iPhone to Android), ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ (Android to iPhone) సులువుగా వాట్సాప్ చాట్ డేటాను బదిలీ చేసుకోవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ కు సంబంధించి వివరాలను శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ప్రొగ్రామ్‌‌లో ప్రకటించింది. ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది.
WhatsApp Web: డెస్క్‌టాప్, వాట్సప్ వెబ్‌లో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు!!

వాట్సాప్ లోని ఛాట్ హిస్టరీ, వాయిస్ నోట్, ఫొటోలు, వీడియోలని వేర్వేరు OSలతో నడిచే ఫోన్లలోకి సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఇదో సేఫెస్ట్ మెథడ్ కూడా. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లో ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. ముందుగా ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది వాట్సాప్. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది. అదే స్టేటస్ ఫీచర్.. ఇప్పటివరకూ వాట్సాప్ యూజర్ స్టేటస్ చూడటానికి ప్రత్యేకంగా స్టేటస్ ట్యాబ్ ఉంది. త్వరలో ఆ ట్యాబ్ తొలగించనుంది. యూజర్ స్టేటస్ కోసం ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేసినప్పుడు.. వ్యూ స్టేటస్, వ్యూ ప్రొఫైల్ ఫొటో అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో స్టేటస్ పై క్లిక్ చేస్తే సరిపోతుందట. ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. కొద్ది మంది బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులోకి వచ్చిందట.. అతి త్వరలోనే యూజర్లందరికి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు