Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు పదేపదే ఫేక్ కాల్స్ వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా సైలెంట్‌లో పెట్టేస్తే సరి..!

Whatsapp Unknown Calls : మీ వాట్సాప్ అకౌంట్‌కు ఇలాంటి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వస్తున్నాయా? స్కామర్ల (Scammers)తో తస్మాత్ జాగ్రత్త.. వెంటనే మీ ఫోన్ ఇలా సైలెంట్ మోడ్‌లో పెట్టేయండి.

Whatsapp Unknown Calls : మీ వాట్సాప్‌కు పదేపదే ఫేక్ కాల్స్ వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా సైలెంట్‌లో పెట్టేస్తే సరి..!

Whatsapp Fake Calls

Updated On : September 20, 2024 / 5:07 PM IST

Whatsapp Unknown Calls : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్లలో ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయా? గుర్తు తెలియని వాట్సాప్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయొద్దు. ఏదైనా అనుమానాస్పద లింకులను కూడా క్లిక్ చేయొద్దు.

భారత్‌లో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగిన వాట్సాప్.. చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వాయిస్ కాలింగ్ అనేది అద్భుతమైన ఫీచర్ అని చెప్పవచ్చు. వాట్సాప్ యూజర్లు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరితో కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ను ఇప్పుడు భారతీయ యూజర్లను మోసగించేందుకు స్కామర్లు దుర్వినియోగం చేస్తున్నారు.

గత కొన్ని వారాలుగా, అంతర్జాతీయ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నాయి. భారతీయ వాట్సాప్ యూజర్లలో ఇలాంటి ఫోన్ కాల్స్ గణనీయమైన పెరిగాయి. అంతర్జాతీయ స్పామ్ కాల్స్ గురించి వచ్చిన నివేదికలపై భారత ప్రభుత్వం వాట్సాప్‌కు నోటీసు కూడా పంపుతోంది. వాట్సాప్‌లో తలెత్తిన ఈ ప్రైవసీ ఇష్యూను పరిష్కరించనున్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. కానీ, ఇది కేవలం 50శాతం స్పామ్ కాల్‌లను మాత్రమే నివారించగలదు. ప్రస్తుతం, వాట్సాప్‌లో స్పామర్‌లు మీకు కాల్ చేయకుండా నిరోధించడానికి ఎలాంటి మార్గం లేదు.

Read Also : iPhone 17 Leaks : ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా, డిస్‌ప్లే, చిప్‌సెట్ వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

అయితే, మీరు తెలియని నంబర్‌ల నుంచి వచ్చే అన్ని కాల్‌లను సైలెంట్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. వాట్సాప్ ప్రస్తుతం గుర్తుతెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు యూజర్లను అనుమతించే ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి.. త్రి డాట్స్ మెనుపై Click చేయండి.
  • ఇప్పుడు, ‘Settings’ పై Click చేయండి.
  • అప్పుడు, ‘Privacy’పై Click చేసి, ‘Calls’పై Click చేయండి.
  • ఇప్పుడు, వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు టోగుల్‌ను ప్రారంభించండి.
  • అన్ని గుర్తుతెలియని కాల్‌లను సైలెంట్ చేయొచ్చు.
  • మీరు కాలర్ నంబర్‌ను సేవ్ చేయకుంటే ముఖ్యమైన కాల్స్ మిస్ కావొచ్చు.
  • ఇప్పటికీ స్పామర్‌లు మీకు కాల్ చేసేందుకు అనుమతిస్తుంది.
  • స్కామర్లు కాల్ చేసినప్పుడు మీకు తెలియదు అంతే..

Read Also : PF Balance Check : ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్ చేయడం తెలుసా? UAN ఎలా యాక్టివేట్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!