అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ బీటా యాప్ వెర్షన్ లో ఈ సరికొత్త ఫీచర్ 2.19.83 అప్ డేట్ అయింది. అదే.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్.

  • Published By: sreehari ,Published On : March 29, 2019 / 11:34 AM IST
అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్

Updated On : March 29, 2019 / 11:34 AM IST

ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ బీటా యాప్ వెర్షన్ లో ఈ సరికొత్త ఫీచర్ 2.19.83 అప్ డేట్ అయింది. అదే.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్.

ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. ఆండ్రాయిడ్ బీటా యాప్ వెర్షన్ లో ఈ సరికొత్త ఫీచర్ 2.19.83 అప్ డేట్ అయింది. అదే.. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పై టెస్టింగ్ చేసిన అనంతరం వాట్సాప్ బీటా యూజర్ల కోసం కొత్త అప్ డేట్ ను రిలీజ్ చేస్తోంది. కొత్త ఫీచర్ కు సంబంధించిన స్ర్కీన్ షాట్స్ ను WAబీటాఇన్ఫో షేర్ చేసింది. 
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ ను సెట్టింగ్స్ లో ఎలా ఎనేబుల్ చేయాలి అనేదానిపై wabetainfo వివరణ ఇచ్చింది. నిజానికి ఈ ఫీచర్ బైడిఫాల్ట్ గా డిసేబుల్ అయి ఉంటుంది. అందుకే బీటా యూజర్లకు ప్రస్తుతానికి ఫీచర్ పనిచేయడం లేదు. స్టేబుల్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనేదానిపై క్లారిటీ లేదు. వాట్సాప్ అకౌంట్ ను ఇతరులు వాడకుండా ఉండేందుకు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ సెక్యూరిటీగా పనిచేస్తుంది. మీ ఫింగర్ ఫ్రింట్ ఉంటేనే వాట్సాప్ అకౌంట్ అన్ లాక్ అవుతుంది. యూజర్ల వాట్సాప్ అకౌంట్ భద్రత దృష్ట్యా వాట్సాప్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. 

ఒకసారి ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే చాలు.. వాట్సాప్ అకౌంట్ లో మీ ఫింగర్ ఫ్రింట్ రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాట్సాప్ ను వెంటనే లాక్ చేయాలా? (వాట్సాప్ క్లోజ్ చేయగానే.. లాగౌట్ కాకుండా) అని అడుగుతుంది. అక్కడ మూడు సూచనలు ఉంటాయి.. అందులో ఒకటి.. ఒక నిమిషం తర్వాత, (లేదా) 10 నిమిషాలు తర్వాత (లేదా) 30 నిమిషాలు తర్వాత ఇలా ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ మూడు అప్షన్ల ద్వారా ఎంత సమయం తర్వాత మీ ఫింగర్ ఫ్రింట్ తో అన్ లాక్ చేసుకోవచ్చో సెలెక్ట్ చేసుకోనే అవకాశం ఉంది.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే

ఒకవేళ యాప్ Unlock కాలేదని.. పదేపదే ట్రై చేస్తే మాత్రం ఓ ఎర్రర్ మెసేజ్ డిసిప్లే అవుతుంది. ఈ ఫీచర్ ఇంకా ఎనేబుల్ కాలేదు. లేటెస్ట్ బీటా వెర్షన్ 2.19.83 లో కూడా ఈ కొత్త ఫీచర్ చూడలేరు. త్వరలో బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ (iOS app)లో అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా.. టచ్ ఐడీ, ఫేషియల్ రికగ్న్ నైజేషన్ ఫీచర్ల ద్వారా కూడా వాట్సాప్ అన్ లాక్ అవుతుంది. 

ఈ ఫీచర్ ఎలా enable చేయాలంటే.. 
* వాట్సాప్ బీటా యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 
* సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర అకౌంట్ పై క్లిక్ చేయాలి.
* ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఇక్కడ Use ఫింగర్ ఫ్రింట్ టూ అన్ లాక్ ను అప్షన్ పై ప్రెస్ చేయండి.
Read Also : ప్రయాణికులకు గుడ్ న్యూస్ : వెయ్యి రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi