WhatsApp iOS Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. iOS యూజర్లు చాట్‌ మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేయొచ్చు!

WhatsApp iOS Update : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp), ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం స్టేబుల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.

WhatsApp iOS Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. iOS యూజర్లు చాట్‌ మెసేజ్‌లను తేదీల వారీగా సెర్చ్ చేయొచ్చు!

WhatsApp for iOS update rolls out ‘Search by Date Feature’

Updated On : January 21, 2023 / 5:22 PM IST

WhatsApp iOS Update : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp), ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం స్టేబుల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు వాట్సాప్ iOS యూజర్లు తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ Apple యాప్ స్టోర్‌లోని iOS యూజర్లకు అందుబాటులో ఉంటుంది. కొత్త అప్‌డేట్ మెటా యాజమాన్యంలోని యాప్‌లోని ఇతర యాప్‌ల నుంచి ఇమేజ్‌లు, వీడియోలు, మరిన్ని మీడియాను డ్రాప్ చేసేందుకు డ్రాగ్ చేసేందుకు చాట్ మెసేజ్‌లలో WhatsAppలోని ఇతర యూజర్లతో షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.

ప్రస్తుతానికి కొంతమంది వాట్సాప్ యూజర్లు కొత్త అప్‌డేట్ అందుకున్నారు. త్వరలో అన్ని iOS యూజర్ల కోసం రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp, వాయిస్-ఓవర్-IP ప్లాట్‌ఫారమ్ ఆపిల్ యాప్ స్టోర్‌లో బిల్డ్ నంబర్ 23.1.75తో సరికొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టాయి. తేదీల వారీగా చాట్ మెసేజ్‌లలో నిర్దిష్ట మీడియాను సెర్చ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఈ అప్‌డేట్ యూజర్ వాట్సాప్ ద్వారా షేర్ చేయాలనుకునే డాక్యుమెంట్‌లు, ఇమేజ్‌లు, వీడియోల కోసం ఇతర యాప్‌ల మధ్య డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్‌ను కూడా ప్రవేశపడుతోంది.

WhatsApp for iOS update rolls out ‘Search by Date Feature’

WhatsApp for iOS update rolls out ‘Search by Date Feature’

Read Also : WhatsApp Voice Messages : వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను ఇకపై స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ప్రస్తుతానికి కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో iOS యూజర్ల అందరికి ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో ఒరిజినల్ క్వాలిటీతో ఇతర కాంటాక్ట్‌లతో ఫోటోలను షేర్ చేసేందుకు యూజర్లను అనుమతించవచ్చు. ప్రస్తుతం, WhatsApp ద్వారా షేర్ చేసే ఫొటోలు కంప్రెస్ అవుతాయి. WaBetaInfo ప్రకారం.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను పంపగల సామర్థ్యంపై కృషి చేస్తోంది. WaBetaInfo అనేది WhatsApp రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే ఆన్‌లైన్ వెబ్‌సైట్. ప్లాట్‌ఫారమ్ ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ కోసం WhatsApp బీటాలో ఫీచర్‌ను కనుగొంది.

నివేదిక ప్రకారం.. మెసేజింగ్ యాప్ డ్రాయింగ్ టూల్ హెడర్‌లో కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని యోచిస్తోంది. కొత్త ఐకాన్ యూజర్లను వారి ఒరిజినల్ క్వాలిటీతో సహా ఫొటో క్వాలిటీని కాన్ఫిగర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫొటోల క్వాలిటీపై యూజర్లకుమరింత కంట్రోల్ చేస్తుంది. కొత్త వాట్సాప్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఫ్యూచర్‌ అప్‌డేట్‌తో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. చాట్ లిస్ట్‌లో నోటిఫికేషన్‌ల నుంచి యూజర్లను బ్లాక్ చేసే సామర్థ్యాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లను బ్లాక్ చేసేందుకు యాప్ రెండు కొత్త ఎంట్రీ పాయింట్లను యాడ్ చేయనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Big Update : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై హై-క్వాలిటీ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు..!