WhatsApp New Chat : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వస్తోంది.. మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు..!
WhatsApp New Chat : ప్రస్తుతానికి ఈ కొత్త కస్టమ్ చాట్ థీమ్స్ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

WhatsApp is bringing more customisation options for users
WhatsApp New Chat : వాట్సాప్ యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. మెటా-యాజమాన్యంలోని వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటిప్పుడూ ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే అనేక ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త చాట్ థీమ్ ఫీచర్ తీసుకువస్తోంది.
ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా చాట్ ఇంటర్‌ఫేస్ కలర్ ఫుల్‌గా మార్చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కొత్త కస్టమ్ చాట్ థీమ్స్ ఫీచర్ కొందరికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ యూజర్లందరికి వచ్చే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
వాట్సాప్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. ఈ కొత్త కస్టమ్ చాట్ థీమ్ ఫీచర్‌ని బీటాలో టెస్టింగ్ చేస్తోంది. మొదట్లో ఆగస్టులో నివేదించిన ఈ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ యూజర్లు సిస్టమ్ డిఫాల్ట్, లైట్, డార్క్ థీమ్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది.
అయితే, ఈ కొత్త అప్‌డేట్‌తో, గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ వెర్షన్ 2.24.21.34తో ప్రారంభించి గరిష్టంగా 22 విభిన్న చాట్ థీమ్‌లు, 20 కలర్ ఆప్షన్లతో సహా కొత్త కస్టమైజడ్ ఆప్షన్లకు యాక్సస్ పొందుతారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు పర్సనల్ చాట్‌లలో కొత్త “చాట్ థీమ్” సెట్టింగ్ పేజీని చూడవచ్చు.
ఈ పేజీ చాట్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్ రెండింటినీ కస్టమైజడ్ చేసేలా సెట్టింగ్ ఉంటుంది. వాట్సాప్ యాప్ మొత్తం ఇంటర్‌ఫేస్ లేదా నిర్దిష్ట చాట్‌లలో డిఫరెంట్ థీమ్‌లను ఎంచుకోవచ్చు. అన్ని చాట్స్‌కు డిఫాల్ట్ థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు. అదనంగా, కొత్త థీమ్‌ని ఎంచుకున్న ప్రతిసారి కాంప్లిమెంటరీ చాట్ కలర్ అప్లయ్ చేయొచ్చు.
కలర్ మాన్యువల్ గా ఎడ్జెస్ట్ చేయొచ్చు :
వాట్సాప్ ప్రతి చాట్‌లో కలర్ మాన్యువల్‌గా ఎడ్జెస్ట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ముఖ్యంగా, ఈ మార్పులు ప్రైవేట్‌గా ఉంటాయి. క్రియేట్ చేసిన యూజర్లకు మాత్రమే కనిపిస్తాయి. చాట్ రీసీవర్ ఎలాంటి కస్టమైజ్ ఎఫెక్ట్స్ చూడలేరు. ఇతరుల మెసేజ్‌లు పంపినా సెట్ చేసినా థీమ్ మాదిరిగానే కనిపిస్తాయి.
ఈ ఫీచర్ విషయానికొస్తే.. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో మాత్రమే ఉంది. ఆండ్రాయిడ్‌లో పరిమిత సంఖ్యలో బీటా టెస్టర్‌లు అప్‌డేట్‌ను పొందారు. వాట్సాప్ వెర్షన్ 24.20.71తో iOS యూజర్లకు కోసం కూడా రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ, ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్లు కూడా ఈ ఫీచర్‌ని వెంటనే చూడలేరు. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ ఇటీవలే వీడియో కాల్స్ కోసం కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు వీడియో కాల్స్‌కు ఫిల్టర్‌లను అప్లయ్ చేయొచ్చు.
వార్మ్, కూల్, డ్రీమీ వంటి 10 రకాల ఆప్షన్లతో క్రియేటివిటీగా చేయొచ్చు. వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ కస్టమైజ్ ఆప్షన్ కూడా ప్రవేశపెట్టింది. వినియోగదారులు ప్రైవసీ కోసం వెనుక వైపు కనిపించకుండా బ్లర్ ఎఫెక్ట్‌ని కూడా అప్లయ్ చేయొచ్చు. ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లతో పాటు, వాట్సాప్ టచ్ అప్ ఫీచర్ కూడా ఉంది. లైటింగ్ సరిగా లేకపోయినా వీడియో క్వాలిటీగా అందించగలదు. లో లైటింగ్ సెట్ ఆప్షన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎఫెక్ట్స్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా వినియోగదారులు కాల్స్ సమయంలో ఈ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు.
Read Also : iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?