WhatsApp Delete Feature : వాట్సాప్‌లో పంపిన మెసేజ్.. ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే కొద్దిగంటల్లోనే ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది.

WhatsApp Delete Feature : వాట్సాప్‌లో పంపిన మెసేజ్.. ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?

Whatsapp May Give Users More Time To Delete Their Messages After Sending Them (2)

Updated On : July 15, 2022 / 11:23 PM IST

WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే కొద్దిగంటల్లోనే ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది. అయితే ఒకసారి పంపిన మెసేజ్ నిర్ణీత గడువు దాటితే అవతలి యూజర్ చాట్ నుంచి మెసేజ్ డిలీట్ చేయలేం. వాట్సాప్ బీటా ఛానెల్‌లో మెసేజ్ పంపిన 2 రోజుల తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లను అనుమతించేందుకు రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది.

ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే వర్తించదు. యూజర్లు ఫోటోలు, వీడియోలు వంటి మీడియా ఫైల్‌లను ఈజీగా అన్‌సెండ్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ (2.22.4.10) WhatsApp బీటాలో రిలీజ్ కానుంది. ఒక యూజర్‌కు మెసేజ్ పంపిన తర్వాత 2 రోజులు, 12 గంటల్లో తమ మెసేజ్‌లను అన్‌సెండ్ చేయగలరని నివేదిక చెబుతోంది.

Whatsapp May Give Users More Time To Delete Their Messages After Sending Them

Whatsapp May Give Users More Time To Delete Their Messages After Sending Them

వచ్చే ఫిబ్రవరిలో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్టు పేర్కొంది. కానీ, ఈ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై క్లారిటీ లేదు. వాట్సాప్ మరో డిలీట్-సంబంధిత ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. యూజర్లకు అతి తొందరలోనే ఈ కొత్త ఫీచర్ రానుంది. మీ చాట్‌లోని ఏదైనా మెసేజ్, మీడియా ఫైల్‌లను డిలీట్ చేయాలంటే.. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు అనుమతి ఉంటుంది. బీటా యూజర్లకు మాత్రం అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ ఇప్పట్లో రావడం చాలా కష్టమే అని చెప్పవచ్చు.

వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్ నిర్దిష్ట వ్యక్తుల నుంచి హైడ్ చేయవచ్చు. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గ్రూపు సభ్యుల నుంచి మాత్రమే ఈ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు. కానీ, అడ్మిన్ మాత్రమే మీరు హైడ్ చేసిన విషయం తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా డెవలప్ స్టేజీలోనే ఉంది. బీటా యూజర్లకు అందుబాటులో లేదు. మరోవైపు.. 2022 చివరిలో Whatsapp కమ్యూనిటీలను తీసుకురానుంది. గ్రూప్ అడ్మిన్‌లకు డిలీట్ ఆప్షన్ కూడా Whatsapp కమ్యూనిటీలతో పాటు ప్రవేశపెట్టనుంది.

Read Also : WhatsApp : వాట్సాప్ స్టేటస్‌లో ఇకపై వాయిస్ నోట్స్ కూడా షేర్ చేయొచ్చు!