WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లో 31 మందితో గ్రూపు కాల్ చేసుకోవచ్చు..!
WhatsApp iPhone Users : వాట్సాప్ iOS యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాల్‌లో గరిష్టంగా 31 మంది వరకు పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.

WhatsApp now allows iPhones users to start group call
WhatsApp iPhone Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. ఐఫోన్ యూజర్లు గరిష్టంగా 31 మందితో మాత్రమే గ్రూప్ కాల్‌లను చేసుకునేందుకు అనుమతిస్తుంది. (WABetaInfo) ప్రకారం.. వాట్సాప్ ఇటీవల యాప్ స్టోర్‌లో iOS 23.21.72 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.
ఇందులో వాట్సాప్ విస్తృతంగా అందరికీ మెరుగైన కాలింగ్‌ను అందజేస్తోందని ప్లాట్‌ఫారమ్ పేర్కొంది. ఇప్పటివరకు, మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Android, iOS రెండింటిలోనూ గరిష్టంగా 15 మంది వ్యక్తులతో మాత్రమే గ్రూప్ కాల్‌లను అనుమతించింది. గత అప్‌డేట్‌లలో వాట్సాప్ గ్రూపు కాల్‌లు 32 మందికి సపోర్టు అందించింది. అయితే, అలాంటి కాల్‌లను ప్రారంభించే యూజర్లు మొదట్లో 15 కాంటాక్టులను మాత్రమే ఎంచుకోవడానికి పరిమితం చేసింది.
ఐఫోన్‌లో వాట్సాప్‌లో గ్రూప్ కాల్‌ను ఎలా ప్రారంభించాలి :
* మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* స్క్రీన్ దిగువన ఉన్న Calls ట్యాబ్‌ను Tap చేయండి.
* స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న కొత్త కాల్ బటన్‌ను నొక్కండి.
* కొత్త గ్రూప్ కాల్ ఆప్షన్ Tap చేయండి.
మీ కాంటాక్టుల లిస్టు కనిపిస్తుంది. మీరు కాల్‌కు యాడ్ చేయాలనుకునే కాంటాక్టులను గుర్తించి వారి పేర్లపై Tap చేయండి. మీరు కాల్‌కు కావలసిన అన్ని కాంటాక్టులను యాడ్ చేసిన తర్వాత, కాల్‌ని ప్రారంభించడానికి వాయిస్ కాల్ బటన్‌ను నొక్కండి. లేటెస్ట్ అప్‌డేట్‌లతో వాట్సాప్ ఇప్పుడు iOS యూజర్లు 32 మంది పాల్గొనేవారితో గ్రూపు కాల్‌లను సులభంగా చేసుకోవచ్చు. తద్వారా కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ముఖ్యంగా, వాట్సాప్ 31 మంది పాల్గొనేవారితో గ్రూప్ కాల్‌ని ప్రారంభించే సామర్థ్యాన్ని క్రమంగా యూజర్లందరికి రిలీజ్ చేస్తోంది.

WhatsApp iPhone Users group call
యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకా ఫీచర్ కనిపించకుంటే.. రాబోయే కొన్ని వారాల్లో ఇది మీ అకౌంట్లో అందుబాటులోకి రావచ్చు. ఇంతలో, వాట్సాప్ కూడా త్వరలో మెటా ద్వారా ఆధారితమైన కొత్త AI సర్వీసులను ప్రవేశపెట్టనుంది. యూజర్లకు మరింత క్రియేటివిటీగా మెసేజ్ పంపేందుకు వీలు కల్పిస్తుంది.
వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు ఇవే :
ఏఐ స్టిక్కర్‌లు : వినియోగదారులు కన్వర్జేషన్ కోసం ఏఐ ఫీచర్ రూపొందించిన నిర్దిష్ట ఆలోచనలు లేదా భావనలను తెలియజేసే కస్టమైజడ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
ఏఐ చాట్‌లు : మెటా AI టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా, వినియోగదారులు వివిధ అంశాలను లోతుగా పరిశోధించడానికి లేదా వారి గ్రూపు చాట్‌లలో చర్చలను పరిష్కరించడానికి ప్రశ్నలను అడగవచ్చు. ఈ ఫీచర్ మెటా ద్వారా క్రియేట్ చేసిన అనేక రకాల స్టిక్కర్లను పొందే అవకాశాన్ని అందిస్తుంది.
ఫోటోరియలిస్టిక్ ఇమేజ్ జనరేషన్ : ఇమాజిన్ (/ imagine) అనే ఆదేశాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఆలోచనలు, లొకేషన్ లేదా వ్యక్తులను సూచించే లైఫ్‌లైక్ ఫొటోలను రూపొందించడానికి AI యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్‌లోని ఈ కొత్త ఏఐ ఫీచర్‌లు యూజర్ చాట్, ప్రైవసీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని మెటా హామీ ఇచ్చింది.
తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ పర్సనల్ మెసేజ్‌లు పరిమితిలో లేవు. ఏఐ వారికి పంపిన వాటిని చదవగలవు. కానీ, మీ పర్సనల్ మెసేజ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. మెటాతో సహా మరెవరూ మెసేజ్‌లను చూడలేరని మెటా అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.