WhatsApp Share Screen : వాట్సాప్‌లో వీడియో కాల్స్‌తో ఇలా ఈజీగా స్ర్కీన్ షేర్ చేసుకోవచ్చు.. కానీ, తస్మాత్ జాగ్రత్త..!

WhatsApp Share Screen : వాట్సాప్ ఇటీవల వీడియో కాల్‌లకు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను చేర్చింది. వినియోగదారులు ఇతరులతో తమ స్ర్కీన్ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ని ఉపయోగించే ముందు, ఇందులో రిస్క్ ఉందనే విషయం తప్పక తెలుసుకోండి.

WhatsApp Share Screen : వాట్సాప్‌లో వీడియో కాల్స్‌తో ఇలా ఈజీగా స్ర్కీన్ షేర్ చేసుకోవచ్చు.. కానీ, తస్మాత్ జాగ్రత్త..!

WhatsApp now allows users to share screen with contacts, but there is a risk

WhatsApp Share Screen : కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి స్క్రీన్ షేరింగ్ బాగా ప్రాచుర్యం పొందింది. Zoom, Google Meet, Apple FaceTime వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అన్నీ స్క్రీన్-షేరింగ్ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవలే మెటా కూడా స్ర్కీన్ షేరింగ్ ఫీచర్‌ని వాట్సాప్ వీడియో కాల్‌లకు చేర్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ స్క్రీన్‌ని వీడియో కాల్‌ల సమయంలో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ ఫీచర్ ఇప్పుడు యూజర్ల డాక్యుమెంట్‌లు, షోకేస్ ప్రెజెంటేషన్‌లను షేర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. మీరు ఆఫీస్ మీటింగ్‌లో వివరాలను షేర్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. అయితే, ఈ కొత్త స్క్రీన్ షేర్ ఫీచర్ కారణంగా కొంత రిస్క్ ఉందనే విషయం గమనించాలి.

స్క్రీన్ షేరింగ్ రిస్క్ ఏంటేంటే? :
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు అందించే స్క్రీన్-షేరింగ్ ఫీచర్‌ల మాదిరిగానే వాట్సాప్ స్క్రీన్ షేర్ కూడా యూజర్ల వారి డివైజ్ స్క్రీన్ కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేయడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ, వాట్సాప్ యూజర్లకు హాని కలిగించే పరిస్థితి ఉంటుంది. ప్రైవసీ, సున్నితమైన సమాచారం బహిర్గతమవుతుంది. ఈ ఫీచర్ జాగ్రత్తగా ఉపయోగించకపోతే.. స్క్రీన్ షేరింగ్ అనుకోకుండా ఇతరులకు సున్నితమైన లేదా ప్రైవేట్ సమాచారాన్ని చూపుతుంది. ఇందులో పాస్‌వర్డ్‌లు, మెసేజ్‌లు, డాక్యుమెంట్లు, మీరు షేర్ చేయకూడదనుకునే ఇతర అంశాలు ఉంటాయి. మీరు పొరపాటున తప్పు కంటెంట్‌ను కూడా షేర్ చేయవచ్చు. ఇది ఇబ్బందికరంగా లేదా గందరగోళంగా ఉండవచ్చు.

Read Also : iPhone 14 Pro Max Discount : 2023 ఇండిపెండెన్స్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 14ప్రోపై రూ. 14,901 డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

రికార్డింగ్ – షేరింగ్ : కాల్ సమయంలో, పాల్గొనేవారు మీ అనుమతి లేకుండా కాల్ సమయంలో షేర్ చేసిన వాటిని రికార్డ్ చేయవచ్చు లేదా స్క్రీన్‌షాట్‌లను తీయవచ్చు. ప్రైవసీ పరంగా సమస్య కావచ్చు లేదా మీ కంటెంట్ అనధికారంగా షేర్ చేయొచ్చు. కాబట్టి, ఈ ఫీచర్ సహాయకరంగా ఉన్నప్పటికీ.. మీ ఫోన్ నుంచి డేటాను షేర్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ స్క్రీన్‌ను షేర్ చేయడం ప్రారంభించే ముందు ఇతరులు చూడకూడదనుకునే ఏదైనా కంటెంట్ హైడ్ చేశారని నిర్ధారించుకోండి. అదనంగా, వాట్సాప్ లేదా ఏదైనా ఇతర ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ షేర్ ఫీచర్ ప్రమాదాల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* మీరు విశ్వసించే వ్యక్తులతో మాత్రమే మీ స్క్రీన్‌ని షేర్ చేయండి.
* అనుకోకుండా ఏదైనా ఇతర ఫోల్డర్‌ను ఓపెన్ చేయకుండా ఉండటానికి మీరు షేరింగ్ చేయాలనుకుంటున్న కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ ఓపెన్ అయిందని నిర్ధారించుకోండి.
* మీరు పూర్తి చేసిన తర్వాత స్క్రీన్ షేరింగ్ సెషన్‌ను ముగించండి.
* ఇంటర్నెట్‌లో మీ స్క్రీన్‌ని షేర్ చేస్తున్నప్పుడు సేఫ్ కనెక్షన్‌ని ఉపయోగించండి.
* లేటెస్ట్ సెక్యూరిటీ పరిష్కారాలు, అప్‌డేట్స్ స్వీకరించడానికి మీ మొబైల్ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్, వాట్సాప్ వంటి యాప్‌లను కూడా లేటెస్టుగా ఉంచండి.

WhatsApp now allows users to share screen with contacts, but there is a risk

WhatsApp now allows users to share screen with contacts, but there is a risk

వాట్సాప్‌లో స్క్రీన్‌ను ఎలా షేర్ చేయాలి
* వాట్సాప్ వీడియో కాల్‌ల సమయంలో మీ స్క్రీన్‌ని షేర్ చేయాలంటే?
* మీరు కోరుకున్న కాంటాక్టు లేదా గ్రూపుతో వీడియో కాల్‌ని ప్రారంభించండి.
* వీడియో కాల్ ప్రారంభమైన తర్వాత మీరు స్క్రీన్ దిగువన ఉన్న స్క్రీన్ షేర్ ఐకాన్‌ను గమనించవచ్చు. దానిపై నొక్కండి.
* మీరు వాట్సాప్ ఉపయోగించి రికార్డింగ్ లేదా కాస్టింగ్ చేయబోతున్నారని సూచించే ప్రాంప్ట్‌ను మీ ఫోన్ డిస్‌ప్లే చేస్తుంది.
* స్క్రీన్ షేరింగ్‌ని ప్రారంభించడానికి ‘Start now’ నొక్కండి.
* స్క్రీన్ షేరింగ్‌ని ముగించడానికి, ‘Stop Sharing’ని ట్యాప్ చేయండి.

Read Also : Moto E13 Price : కొత్త 128GB వేరియంట్‌తో మోటో E13 ఫోన్.. ధర కేవలం రూ.8,999 మాత్రమే.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు..!