Whatsapp New Feature : వాట్సాప్‌‌లో మెసేజ్‌ రియాక్షన్‌ అప్‌డేట్.. ఇకపై ఎన్ని ఎమోజీలైనా వాడొచ్చు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్.. కొత్త ఎమోజీలను యాడ్ చేయనుంది.

Whatsapp Reactions Feature Whatsapp Reactions Feature New Update, You May Use More Emojis From Messaging Platform

Whatsapp Reactions Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్.. కొత్త ఎమోజీలను యాడ్ చేయనుంది. ఇప్పటివరకూ వాట్సాప్ చాట్ బాక్సులో కేవలం ఆరు ఎమోజీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంది.

వాట్సాప్ ప్లాట్ ఫాంపై డిలీట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌, బల్క్‌ మెసేజ్‌ డిలీట్‌ వంటి ఫీచర్లను వాట్పాప్ తీసుకొచ్చింది. వాట్సాప్‌ మరో కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టనుంది. వాట్సాప్ యూజర్లు ఇతరులు పంపిన టెక్స్ట్ మెసేజ్‌కు ఇన్‌స్టాంట్‌గా ఎమోజీల రూపంలో పంపవచ్చు. దీన్నే రియాక్షన్‌ ఫీచర్‌ అని పిలుస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ ఫీచర్‌లో కేవలం 6 ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలు ఇందులో యాడ్‌ కానున్నాయని వాట్సాప్‌ పేర్కొంది.

Whatsapp Reactions Feature Whatsapp Reactions Feature

అయితే మరో అప్‌డేట్‌ను కూడా వాట్సాప్‌ ప్రవేశపెట్టనుంది. రానున్న ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్‌ ద్వారా చాట్‌ పేజీ, గ్రూప్స్‌లో ఏయే మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్‌తో రిప్లయ్ ఇచ్చారో లిస్టు మొత్తాన్ని చూడొచ్చు. అదంతా చాట్‌ పేజీపై భాగంలో కనిపిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read Also : Google Play Store: యాప్‌ డెవలపర్లకు గూగుల్ హెచ్చరిక.. ప్లే స్టోర్‌లో యూజర్ల ప్రైవసీపై నిర్లక్ష్యం వద్దు!