WhatsApp Status వీడియో టైం తగ్గిపోనుంది!!

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 10:10 AM IST
WhatsApp Status వీడియో టైం తగ్గిపోనుంది!!

Updated On : April 28, 2020 / 10:10 AM IST

కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపిస్తుంది. 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ వీడియో స్టేటస్ నిడివిని తగ్గించేయనున్నారు. ఫేస్‌బుక్ కంపెనీకి చెందిన వాట్సప్ వీడియో స్టేటస్ ఇకనుంచి 15సెకన్లు మాత్రమే ఉండనుంది. 16సెకన్ల వీడియో పోస్టు చేయాలన్నా 2భాగాలుగానే పోస్టు చేయాలి. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వినియోగదారులందరికీ స్టేటస్ లోడ్ అవడానికి ఇంటర్నెట్ నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయి. 

లాక్ డౌన్ సమయంలో ఫన్నీ వీడియోలు, అరుదైన సంఘటనలను స్టేటస్ ల రూపంలో పంచుకుంటున్నారు. ఇంట్లో ఉండి టైం పాస్ కోసం ఎక్కువగా ఇంటర్నెట్ నే వాడుతుండటంతో.. 30సెకన్ల నిడివి ఉన్న వీడియోలు ఓపెన్ అవడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎక్కువగా వాట్సప్ స్టేటస్‌లు షేర్ చేసే వారికి సమస్యగా మారుతుంది. దీనికి సులువైన పరిష్కారంగా 15సెకన్లు మాత్రమే పరిమితిని తగ్గించారు. 

 

ఇలా చేయడంతో ఇంటర్నెట్ ఆదా అవడంతో పాటు ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. వాబీటాఇన్ఫో ట్వీట్ ద్వారా వెల్లడించింది. భారత్ లో ఇప్పటికీ 400మిలియన్ వాట్సప్ యూజర్లు ఉన్నారు. ఏ వీడియోనైనా 15సెకన్లు ట్రిమ్ చేసి దానిని స్టేటస్ కింద అప్‌లోడ్ చేసే ఫీచర్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్ అతి త్వరలో వాడుకలోకి రానుంది. 

వాట్సప్ యాప్ లాంచ్ సమయంలో వీడియో స్టేటస్ నిడివి 90 సెకన్ల నుంచి 3నిమిషాల వరకూ ఉండేది. ఒకవేళ వీడియో 16మెగా బైట్స్ కంటే ఎక్కువ సైజ్ ఉంటే ట్రిమ్ చేసుకునేందుకు  ఆప్షన్ ఇచ్చేది. ట్రిమ్ అయిన వీడియో మాత్రమే అప్‌లోడ్ అయ్యేది.