WhatsApp Sticker Packs : వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు!
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. అదే.. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ ద్వారా మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు.

Whatsapp Users Can Now Create Stickers On Web And Desktop
WhatsApp Sticker Packs : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చింది. అదే.. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ (Sticker Packs) ఈ ఫీచర్ ద్వారా మీరే సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి స్టిక్కర్ల కోసం థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సిన పనిలేదు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఎక్కువగా ఎమోజీలకే ఫుల్ క్రేజ్ ఉంది. వాట్సాప్‌లో చాలామంది స్నేహితులతో ఎమోజీలతోనే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. చాటింగ్ లో తమ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఈ ఎమోజీలనే వాడుతుంటారు.
ఇప్పుడా ఎమోజీలకు దీటుగా స్టిక్కర్ ప్యాక్స్ వచ్చేశాయి. ఎమోజీల కంటే ఈ స్టిక్కర్ ప్యాక్స్ ఎక్కువగా క్రేజ్ ఉంది. యూజర్ల ఆసక్తి దృష్ట్యా వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. స్టిక్కర్ ప్యాక్స్ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ క్రియేటివిటీని ఉపయోగించి సొంతంగా స్టిక్కర్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇతరులకు పంపుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే వాట్సాప్ యూజర్లు ఈ
స్టిక్కర్లను క్రియేట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా (Whatsapp Beta) వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ టెస్టింగ్ స్టేజ్‌లో చెక్ చేస్తోంది. ఈ టెస్టింగ్ ఒకసారి పూర్తి అయిన వెంటనే ఈ స్టిక్కర్ క్రియేట్ ఆప్షన్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. వాట్సాప్ వెబ్ (Whatsapp Web)లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ Sticker Packs ఆప్షన్ ద్వారా స్నిప్పింగ్, క్రాపింగ్, రొటేటింగ్ వంటి ఆప్షన్లతో తీసుకొచ్చింది.
ఇందులో Snipping, Cropping, Rotationg వంటి ఆప్షన్లతో వాట్సాప్ స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. పండుగ సమయాల్లో లేదా ఏదైనా స్పెషల్ వెకేషన్లలో యూజర్లు సొంతంగా ఈ స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. మీ కాంటాక్టు లిస్టులోని స్నేహితులందరికి పంపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ క్రియేటివిటీకి పదునుపెట్టండి. అందమైన ఆకర్షణీయమైన స్టిక్కర్ క్రియేట్ చేయండి.
Read Also : Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం