లాక్‌డౌన్ టైమ్‌లో టిక్‌టాక్ టిక్‌టాక్… ఇండియన్స్ ఎక్కువగా అందులోనే!

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మన దేశంలో ఇప్పుడు చైనా తయారు చేసిన టిక్ టాక్ ని బాన్ చెయ్యాలి అనే డిమాండ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అందరూ గడుపుతున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ అట.
భారతీయులు లాక్ డౌన్ సమయంలో ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లలో ఎక్కువగా గడుపుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29 వరకు వచ్చిన గణాంకాల ప్రకారం టిక్‌టాక్, అసాధారణమైన రీతిలో దూసుకెళ్తుంది.
భారతదేశంలో 800 మిలియన్లకు పైగా వినియోగదారులతో టిక్‌టాక్ దూసుకెళ్తుంది. టిక్ టాక్‌లో ఓ యూజర్ సగటు గడిపే సెషన్ సమయం 39.5 నిమిషాల నుండి 56.9 నిమిషాలకు పెరిగింది. లైవ్ వీడియో స్ట్రీమింగ్ సమయం కూడా బాగా పెరిగిపోయింది. Live.meలో గడిపిన సమయం కూడా 315% పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వరుసగా 59% మరియు 53% పెరిగాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్.. సామాజిక దూరం ప్రారంభం అయినప్పటి నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వాడకంలో స్థిరమైన పెరుగుదల కనిపించిందని చెబుతున్నారు. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో గడుపుతున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజువారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య ఒక రోజులో ఒక ప్లాట్‌ఫారమ్‌ను తెరిచి, నిమగ్నమయ్యేవారు, ట్విట్టర్‌లో ఎక్కువ అయ్యారని చెబుతున్నారు. వార్తాపత్రికల లభ్యత లేకపోవడం వల్ల, ప్రజలు ఆన్‌లైన్‌లో న్యూస్ ఎక్కువగా చూస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి.
ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఇప్పటికే ఎక్కువగా చూసేవాళ్లు ఉండడంతో వాటిలో మాత్రం మార్పులు పెద్దగా కనిపించలేదు. టిక్‌టాక్ మాత్రం లాక్‌డౌన్ టైమ్‌లో వినియోగదారులను, వినియోగాన్ని భారీగా పెంచుకుంది.