Xiaomi 12 Pro 5G Offer : అమెజాన్‌లో షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మళ్లీ ధర పెరగొచ్చు.. ఇప్పుడే కొనేసుకోండి..!
Xiaomi 12 Pro 5G Offer : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ (Amazon)లో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ సొంత బ్రాండ్ షావోమీ 12ప్రో (Xiaomi 12Pro 5G)ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Xiaomi 12 Pro 5G Offer _ Get Xiaomi 12 Pro 5G on Amazon at just Rs. 31,949 _ Here’s how deal works
Xiaomi 12 Pro 5G Offer : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ (Amazon)లో చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ సొంత బ్రాండ్ షావోమీ 12ప్రో (Xiaomi 12Pro 5G)ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. షావోమీ 12 Pro ఫోన్ ఊహించలేని ధరకు అందిస్తోంది. ఈ 5G ఫోన్ తక్కువ ధరకే పొందాలంటే వెంటనే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోండి.. మీరు ఫ్లాగ్‌షిప్ స్థాయి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. ఈ డీల్ అసలే మిస్ చేసుకోవద్దు..
షావోమీ 12 ప్రో ధర, డీల్ ఎంతంటే? :
Xiaomi 12 Pro (12GB RAM, 256GB స్టోరేజీ) ధర రూ. 79999గా ఉంది. అమెజాన్‌లో (Xiaomi 12 Pro) డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అంటే.. దాదాపుగా 30 శాతం తగ్గింపు పొందవచ్చు. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 24వేలకు సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్‌లో మీరు మరొక ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.
ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు అవసరం లేదు. ఈ తగ్గింపు తర్వాత Xiaomi 12 Pro ధర రూ. రూ. 55999లుగా ఉంటే.. లిమిటిట్ పీరియడ్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ.24,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుంటే.. ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

Xiaomi 12 Pro 5G Offer _ Get Xiaomi 12 Pro 5G on Amazon at just Rs. 31,949
మీరు ఏ డివైజ్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నా కొంత తగ్గింపును పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం విలువను పొందితే.. Xiaomi 12 ప్రోని కేవలం రూ. 31949లకు పొందవచ్చు. షావోమీ 12 Pro ఫోన్ 2K+ AMOLED డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ 1500 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. డిస్ప్లే డిస్ప్లేమేట్ ద్వారా A+ సర్టిఫికేట్ పొందింది. డాల్బీ విజన్, HDR10+ కంప్లైంట్ కూడా ఉంది. షావోమీ12 Pro 50MP Sony IMX707 సెన్సార్‌ని కలిగి ఉంది. 120శాతం ఎక్కువ లైటింగ్ అడ్జెస్ట్ చేస్తుంది.
50MP టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఈ డివైజ్ ముందు భాగంలో 32MP కెమెరాను అమర్చారు. షావోమీ12 Pro స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 ద్వారా రన్ అవుతుంది. Android 12 పైన MIUI 13 ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. ఈ డివైజ్ 4,600mAh బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. బాక్స్‌లో 120W హైపర్‌ఛార్జ్ ఛార్జర్‌కు సపోర్టుతో వస్తుంది. ఛార్జర్ 18 నిమిషాల్లో ఈ డివైజ్ 0 నుంచి 100శాతం వరకు వేగంగా ఛార్జ్ చేస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. చివరిగా.. ఈ హ్యాండ్‌సెట్ బరువు 108 గ్రాములు వరకు ఉంటుంది.