Xiaomi 12 Pro 5G Sale : భారత్‌లో షావోమీ 12 ప్రో .. 5G ఫోన్‌పై రూ.10వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!
Xiaomi 12 Pro 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి భారత మార్కెట్లో రిలీజ్ అయిన Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ సేల్ మొదలైంది. మే 2 నుంచి ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది.

Xiaomi 12 Pro Goes On Sale Starting Today In India Price, Specifications, Offers
Xiaomi 12 Pro 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి భారత మార్కెట్లో రిలీజ్ అయిన Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ సేల్ మొదలైంది. మే 2 నుంచి ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. గత నెలాఖరులో భారత మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు (Xiaomi 12 Pro) సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Xiaomi 12 Pro ధర రూ. 62,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కంపెనీ అనేక సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. Xiaomi 12 Pro ఒరిజినల్ ధర నుంచి రూ.52,999 తగ్గించింది. అంటే.. రూ.10వేల వరకు సేల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
Xiaomi 12 ప్రో ఫీచర్లు, ధర వివరాలు :
Xiaomi 12 Pro రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వచ్చింది. బేస్ వేరియంట్ 8GB + 256GB స్టోరేజీ ఆప్షన్ రూ. 62,999 అందుబాటులో ఉంది.అయితే 12GB +256GB స్టోరేజీ ధర రూ. 66,999గా ఉంది. కొనుగోలు దారులు.. ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేయొచ్చు. దీనిపై రూ. 4,000 కాంటాక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 6,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. Xiaomi 12 Proని రూ. 52,999కి కొనుగోలు చేయవచ్చు. 12GB RAM ఆప్షన్ రూ. 56,999 కొనుగోలు చేయవచ్చు. Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్ కోచర్ బ్లూ, నోయిర్ బ్లాక్ ఒపెరా మావ్ అనే 3 రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. Mi.com, Mi హోమ్ స్టోర్‌లు, Amazon India ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Xiaomi 12 Pro స్పెసిఫికేషన్స్ :
Xiaomi 12 Pro స్మార్ట్ ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.73-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. LTPO 2.0 ప్యానెల్ స్క్రీన్, 1Hz 120Hz రిఫ్రెష్‌తో వచ్చింది. Xiaomi 12 Pro డిస్‌ప్లే 1500 నిట్ కలిగి ఉంది. HDR10+ ధృవీకరణతో పాటు డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్‌కు సపోర్టు అందిస్తుంది. క్వాడ్-స్పీకర్ సెటప్ హర్మాన్ కార్డాన్‌తో వచ్చింది.

Xiaomi 12 Pro Goes On Sale Starting Today In India Price, Specifications, Offers
ఇక ఫోన్ హుడ్ కింద, 12Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen1 SoC కలిగి ఉంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4600 mAh బ్యాటరీని అందిస్తుంది. మీరు డివైజ్‌తో 120W ఛార్జర్ కూడా అందిస్తుంది. ఫోన్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది.
Xiaomi 12 Pro ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్టుతో 50MP Sony IMX707 ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. అంతేకాదు.. 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం.. 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. Xiaomi ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13తో 12 Pro ఫోన్ లాంచ్ చేసింది.
Read Also : Realme Pad Mini : రియల్ మీ ప్యాడ్ మినీ విక్రయాలు షురూ.. అదిరిపోయే ఆఫర్..