Realme Pad Mini : రియల్ మీ ప్యాడ్ మినీ విక్రయాలు షురూ.. అదిరిపోయే ఆఫర్..

రియల్ మీ ప్యాడ్ మినీ సేల్స్ తొలిసారిగా భారత్ లో సోమవారం మధ్యాహ్నం 12గంటలకు మొదలయ్యాయి. రియల్ మీ ప్యాడ్ ధర, స్పెసిఫికేషన్స్ ఇవే...

Realme Pad Mini : రియల్ మీ ప్యాడ్ మినీ విక్రయాలు షురూ.. అదిరిపోయే ఆఫర్..

Realme Pad Mini

Updated On : May 2, 2022 / 4:45 PM IST

Realme Pad Mini : తన ట్యాబ్లెట్ పోర్ట్ ఫోలియోకు సంబంధించి రియల్ మీ రీసెంట్ గా కొత్త బడ్జెట్ ట్యాబ్లెట్ తీసుకొచ్చింది. అదే రియల్ మీ ప్యాడ్ మినీ. రియల్ మీ ప్యాడ్ మినీ (ఆండ్రాయిడ్) విక్రయాలు మొదటిసారిగా సోమవారం మధ్యాహ్నం మొదలయ్యాయి. రియల్ మీ ప్యాడ్ కంటే ప్యాడ్ మినీ కొంచెం చిన్నదిగా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సైజులోనే కాదు, పనితీరులోనూ రియల్ మీ ప్యాడ్ తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చినట్టు రియల్ మీ సంస్థ ప్రకటించింది.

Realme Pad Mini First Sale in India Starts Price, Launch Offers, and Specifications

Realme Pad Mini First Sale in India Starts Price, Launch Offers, and Specifications

పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీ ఆకర్షణీయంగా ఉంటుంది. వైఫై, ఎల్టీఈని సపోర్ట్ చేసే రకాలు ఇందులో ఉన్నాయి.
* వైఫై పై పని చేసే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ధర రూ.10,999.
* 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999.
* అదే ఎల్టీఈ (4జీని నెట్ వర్క్ సిమ్ తో పని చేసే) వేరియంట్ 3జీబీ, 32జీబీ ధర రూ.12,999.
* 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.14,999.
* బ్లూ, గ్రే రంగుల్లో లభ్యం.

Netflix Airtel Plans : ఎయిర్‌టెల్ OTT యూజర్లకు అదిరే ఆఫర్.. ఆ రెండు ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!

ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు మొదలయ్యాయి. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇవి లభించనున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద రూ.2వేలు తగ్గింపును రియల్ మీ ఆఫర్ చేసింది.

Realme Pad Mini First Sale in India Starts Price, Launch Offers, and Specifications

Realme Pad Mini First Sale in India Starts Price, Launch Offers, and Specifications

Xiaomi : షావోమీకి షాక్ ఇచ్చిన ఈడీ.. ఎందుకో తెలుసా

స్పెసిఫికేషన్స్..
* 8.7 అంగుళాల స్క్రీన్
* హెచ్ డీ రిజల్యూషన్
* బెజెల్స్ పలుచుగా ఉంటాయి.
* యూనిసాక్ ప్రాసెసర్.
* 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ.
* 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది.
* 16 గంటల పాటు వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
* బరువు 372 గ్రాములు.