Xiaomi 13 Pro Series : ఫిబ్రవరి 26న షావోమీ 13ప్రో సిరీస్ 3 వేరియంట్లలో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
Xiaomi 13 Pro Series : రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023) సందర్భంగా ఫిబ్రవరి 26న షావోమీ (Xiaomi 13) సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ కానుంది. అదే రోజున షావోమీ13 ప్రో భారత మార్కెట్లో రానుందని కంపెనీ ధృవీకరించింది.

Poco C55 India Launch Date Set for February 21, to Be Sold via Flipkart_ All Details
Xiaomi 13 Pro Series : రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023) సందర్భంగా ఫిబ్రవరి 26న షావోమీ (Xiaomi 13) సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ కానుంది. అదే రోజున షావోమీ13 ప్రో భారత మార్కెట్లో రానుందని కంపెనీ ధృవీకరించింది. Qualcomm లేటెస్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC Xiaomi 13 స్మార్ట్‌ఫోన్ లైనప్‌తో వస్తుంది.
రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ గ్లోబల్ వేరియంట్‌ల గురించిన వివరాలు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు గతంలో అనేక ధృవీకరణ సైట్‌లలో లిస్టు అయ్యాయి. Xiaomi 13 లైనప్ ధర, రంగులు, డిజైన్ రెండర్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ (@Sudhanshu1414) మూడు మోడళ్ల హై-రిజల్యూషన్ రెండర్‌లతో పాటుగా Xiaomi 13 Lite, Xiaomi 13, Xiaomi 13 Pro గ్లోబల్ ధరలను లీక్ చేసింది.

Poco C55 India Launch Date Set for February 21, to Be Sold via Flipkart
Read Also : Twitter 2FA Setup : వచ్చే మార్చి నుంచి ట్విట్టర్ యూజర్లు ఛార్జీలు చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
టిప్‌స్టర్ వివరాల ప్రకారం.. Xiaomi 13 బేస్ స్టోరేజ్ ఆప్షన్ ధర EUR 999 (సుమారు రూ. 88,700), Xiaomi 13 Pro ధర EUR 1299 (దాదాపు రూ. 1,15,300)గా ఉండవచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. Xiaomi 13 Lite, Xiaomi Civi 2 రీబ్యాడ్జ్ కానుంది. దీని ధర EUR 499 (దాదాపు రూ. 44వేలు) ఉంటుంది. ఇంతలో, Xiaomi 13 Pro మోడల్ బ్లాక్, వైట్, బేస్ మోడల్ గ్రీన్, బ్లాక్, వైట్ కలర్ వేరియంట్‌లతో రెండు కలర్ ఆప్షన్లలో సేల్ అందుబాటులో ఉండనుంది.
ఆంబోర్ ప్రకారం.. Xiaomi 13 Lite పింక్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. లైకా ట్యూన్డ్ కెమెరా సెటప్‌తో రానున్న Xiaomi 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ఫస్ట్ మోడల్ అని చెప్పవచ్చు. రెండు బ్రాండ్‌లు గతంలో Xiaomi 12S అల్ట్రాతో వచ్చాయి. గత ఏడాదిలో Xiaomi 12 సిరీస్‌లో Leica-బ్రాండెడ్ కెమెరాలతో వచ్చింది.