Xiaomi 16 Series
Xiaomi 16 Series: షావోమీ 16 సిరీస్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ మొదట వచ్చేనెల చైనాలో లాంచ్ అవుతుందని, తర్వాత 2026 ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ సారి షావోమీ కేవలం ఫోన్ లాంచ్ చేయడం మాత్రమే కాకుండా, తన మొత్తం ప్రొడక్ట్ పొజిషనింగ్‌లో పెద్ద మార్పును చేస్తోంది.
కొత్త మోడల్స్.. భిన్నమైన స్ట్రాటజీ
ఇప్పటివరకు షావోమీ కేవలం బేస్, ప్రో, అల్ట్రా మోడల్స్ మాత్రమే లాంచ్ చేసింది. ఈ సారి లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్తగా ప్రో మినీ మోడల్ కూడా ఈ సిరీస్‌లో ఉంటుంది. దీంతో యూజర్లకు కాంపాక్ట్, మిడ్ సైజ్, హై ఎండ్ ఫోన్ల ఆప్షన్లు లభిస్తాయి. కంపెనీ లక్ష్యం భిన్నమైన యూజర్లను టార్గెట్ చేయడం. (Xiaomi 16 Series)
ప్రాసెసర్ పనితీరు
షావోమీ 16 సిరీస్‌లో క్వాల్కమ్ కొత్త Snapdragon 8 Elite 2 చిప్‌సెట్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన ప్రాసెసర్లలో ఒకటి. ఈ ప్రాసెసర్ AI పనితీరు, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ చిప్‌సెట్ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌గా షావోమీ 16 సిరీస్ నిలుస్తుంది.
Also Read: భారత మార్కెట్‌లో వివో V60 5G విడుదలైంది.. అబ్బబ్బ ఏముంది భయ్యా.. కెవ్వుకేక
కెమెరాలో పెద్ద అప్‌గ్రేడ్
షావోమీ 16 సిరీస్ కెమెరా పరంగా కూడా పెద్ద మార్పు తీసుకువస్తోంది. ఈ సారి ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది ఆటోఫోకస్ 4K 60fps వీడియోను సపోర్ట్ చేస్తుంది. రియర్ కెమెరా సెట్‌ప్‌లో కూడా మెరుగులు ఉంటాయి. ఇప్పుడు బేస్ మోడల్‌లో కూడా పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రో వెరియంట్‌లో ToF సెన్సార్ డైనమిక్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. అల్ట్రా మోడల్‌లో లైకా ట్యూనింగ్ 200MP వరకు సెన్సార్ కూడా వచ్చే అవకాశం ఉంది.
బ్యాటరీ చార్జింగ్
బ్యాటరీ పరంగా కూడా ఈ సిరీస్ శక్తిమంతంగా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం షియోమీ 16లో 6800mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కొత్త సిలికాన్ కార్బన్ సెల్ టెక్నాలజీతో తయారు అవుతుంది. దీని ద్వారా 100W ఫాస్ట్ చార్జింగ్ 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అల్ట్రా మోడల్ బ్యాటరీ 7500mAh వరకు ఉండవచ్చు.
డిస్‌ప్లే డిజైన్
డిజైన్ పరంగా షావోమీ 16 సిరీస్ ఇంతకుముందు కంటే ప్రీమియంగా ఉంటుంది. ఫోన్‌లో బై కలర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ ఇస్తుంది. డిస్‌ప్లే సైజ్ మోడల్‌పై ఆధారపడి మారుతుంది. మినీ మోడల్ 6.3 అంగుళాల స్క్రీన్, స్టాండర్డ్ 6.5 అంగుళాల స్క్రీన్, ప్రో 6.8 అంగుళాల స్క్రీన్ తో ఉంటుంది. అన్ని ఫోన్లలో AMOLED ప్యానెల్స్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ప్రో అల్ట్రా మోడల్స్‌లో LTPO టెక్నాలజీ ఉంటుంది.