Xiaomi 11i HyperCharge: 120W ఫాస్ట్ ఛార్జింగ్ తో విడుదలైన షియోమి11i HyperCharge

11i సిరీస్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది షియోమి సంస్థ. షియోమి11i HyperCharge 5G ఫోన్ ను గురువారం భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది.

Xiaomi 11i HyperCharge: 120W ఫాస్ట్ ఛార్జింగ్ తో విడుదలైన షియోమి11i HyperCharge

Xioami

Updated On : January 6, 2022 / 3:02 PM IST

Xiaomi 11i HyperCharge: చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి, తమ 11 సిరీస్ ఫోన్స్ ను మరింత విస్తరిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న 11i సిరీస్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది షియోమి సంస్థ. షియోమి11i HyperCharge 5G ఫోన్ ను గురువారం భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. భారత్ లోనే మొట్టమొదటిసారిగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్న ఈ 11i HyperCharge స్మార్ట్ ఫోన్, ఎక్కువ బ్యాటరీ సామర్ధ్యం కోరుకునే వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ పేర్కొంది.

Also read: Viral News: 20 ఏళ్ల తరువాత మాఫియా డాన్ ను పట్టించిన గూగుల్ మ్యాప్స్

ఈ షియోమి11i HyperCharge 5G స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే..120GHz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, MediaTek డైమెన్సిటీ 920 SoC, వెనుక 108MP శాంసంగ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ప్రైమరీ కెమెరా, Dolby Atmos ఆడియో వంటి ఫీచర్స్ ఉన్నాయి. 4500 బ్యాటరీతో 120W ఛార్జింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ 15 నిముషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుందని షియోమి పేర్కొంది. రెండు వేరియంట్లలో జనవరి 12 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ ధరలు.. 6GB ర్యాం + 128GB స్టోరేజ్ కెపాసిటీ ధర Rs. 26,999 గానూ, 8GB + 128GB వేరియంట్ ధర Rs. 28,999 గానూ ఉంది. జనవరి 12 నుంచి ఆన్ లైన్ తో పాటు, ఆఫ్ లైన్ లోనూ ఈ ఫోన్ లభిస్తుందని సంస్థ ప్రకటించింది.

Also read: Nara Lokesh: పోలవరం నిర్వాసితుల సమస్యలపై జగన్ కు లోకేష్ లేఖ