Xiaomi Smart Speaker : IR కంట్రోల్‌తో షావోవీ స్మార్ట్ స్పీకర్.. ధర ఎంతంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ నుంచి కొత్త స్మార్ట్ స్పీకర్ వచ్చింది. భారత మార్కెట్లోకి రెండో కొత్త స్మార్ట్ స్పీకర్‌ను లాంచ్ చేసింది.

Xiaomi Smart Speaker : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమీ నుంచి కొత్త స్మార్ట్ స్పీకర్ వచ్చింది. భారత మార్కెట్లోకి రెండో కొత్త స్మార్ట్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. Xiaomi స్మార్ట్ హోమ్ అప్లియలెన్స్ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచింది. Xiaomi స్మార్ట్ స్పీకర్ IR కంట్రోల్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ సెంటర్, బ్యాలెన్స్‌డ్ సౌండ్ ఫీల్డ్, LED క్లాక్ డిస్‌ప్లే, మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్పీకర్ ఇంటర్నల్ స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ 5.0తో వస్తుంది. పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అందించే 1.5 అంగుళాల మోనో స్పీకర్‌ను కలిగి ఉంది.

Xiaomi ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని టాప్ 3 స్మార్ట్ స్పీకర్ బ్రాండ్‌లలో షావోమీ ఒకటిగా పేర్కొన్నారు. Xiaomi హౌస్ నుంచి Xiaomi స్మార్ట్ స్పీకర్ (IR కంట్రోల్) లాంచ్‌ని ప్రకటించినందుకు చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. బ్రాండ్ వెర్షన్లతో స్మార్ట్ స్పీకర్ ప్రత్యేకమైన ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో వచ్చిందన్నారు. మీ ఇంటిని సైతం స్మార్ట్‌గా మార్చేలా మల్టీమీడియా ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. Xiaomi స్మార్ట్ స్పీకర్ (IR కంట్రోల్)తో మీ హోం థియేటర్ కంట్రోల్ చేయవచ్చు.

Xiaomi Smart Speaker With Ir Control Launched In India, Price Set Under Rs 5000 

Xiaomi స్మార్ట్ స్పీకర్: ధర ఎంతంటే? :
IR కంట్రోల్‌తో కూడిన Xiaomi స్మార్ట్ స్పీకర్ Mi.com, Mi Homes, Flipkart.com వంటి రిటైల్ స్టోర్లలో రూ. 4,999కి అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్‌లు :
Xiaomi స్మార్ట్ స్పీకర్.. రూంలోని లైటింగ్ తగ్గినట్టుగా అడ్జెస్ట్ అవుతుంది. అడాప్టివ్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇచ్చేలా LED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ స్పీకర్‌ను అలారంలా కూడా ఉపయోగించవచ్చు అలారం సెట్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన పాటలు, గాయకులు, ఆర్టిస్ట్ వంటి మూవీ ఆడియో సీన్లను ఎంచుకోవచ్చు. Xiaomi స్మార్ట్ స్పీకర్ IR కంట్రోల్‌తో వస్తుంది. అప్లియన్సెస్ కోసం వాయిస్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. సంప్రదాయ స్మార్ట్-యేతర డివైజ్‌లకు సపోర్టు చేస్తుంది. స్పీకర్ Google అసిస్టెంట్‌తో వచ్చింది. స్మార్ట్ హోమ్ అనుభవాన్ని అందించేలా యూజర్లకు Xiaomi హోమ్ యాప్‌తో పాటు Google Home యాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Digital : రిలయన్స్ నుంచి 100GB ఫ్రీ డేటాతో HP Smart SIM ల్యాప్‌టాప్.. వారికి మాత్రమే!

ట్రెండింగ్ వార్తలు