Xiaomi X Pro Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ వచ్చేస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. సూపర్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Xiaomi X Pro Smart TV : కంపెనీ రాబోయే స్మార్ట్ టీవీని మొత్తం 3 సైజులలో రిలీజ్ చేయనుంది. మ్యాజిక్యూ ఫీచర్ గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీలతో పోలిస్తే.. డిస్‌ప్లే క్వాలిటీ చాలా మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది.

Xiaomi X Pro QLED Smart TV series ( Image Source : Google )
Xiaomi X Pro Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? చైనా టెక్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ రాబోతోంది. ఈ నెల 27న భారత మార్కెట్లో షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్ చేయనుంది. గత ఫిబ్రవరిలో షావోమీ ఎక్స్ ప్రో సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌టీవీని ప్రవేశపెట్టనుంది.
కంపెనీ రాబోయే స్మార్ట్ టీవీని మొత్తం 3 సైజులలో రిలీజ్ చేయనుంది. మ్యాజిక్యూ ఫీచర్ గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీలతో పోలిస్తే.. డిస్‌ప్లే క్వాలిటీ చాలా మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది. మెరుగైన విజువల్స్, మ్యాగీక్యూ కోసం 4కె మ్యాగీక్యూ ఫీచర్ ప్రవేశపెట్టింది. టీవీ సిరీస్ ఆడియో క్వాలిటీని పెంచుతుందని భావిస్తున్నారు.
భారత్‌లో షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ :
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ 2024 స్మార్ట్ టీవీ ఆగస్టు 29న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. షావోమీ మైక్రోసైట్ ప్రకారం.. లైనప్ మూడు విభిన్న సైజులను కలిగి ఉంటుంది. 43-అంగుళాల, 55-అంగుళాలు, 65-అంగుళాలు. షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలు 4కె రిజల్యూషన్‌తో 65-అంగుళాల క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. వీక్షకులకు అద్భుతమైన కలర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి (MagiQ) టెక్నాలజీని కలిగి ఉంది. మైక్రోసైట్ ప్రకారం.. టీవీలు చాలా స్లిమ్ బెజెల్స్‌తో “ఆల్-స్క్రీన్ డిజైన్”తో వస్తాయి. మెటల్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి.
షావోమీ 2024 ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్, గూగుల్ టీవీ నేచురల్ ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో ఆధారితమైన వ్యూతో పాటు, కంటెంట్ యాక్సెస్ కోసం 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ యూజర్లు కంటెంట్ సెర్చింగ్ సమస్యలను పరిష్కరిస్తుంది.
హోమ్‌పేజీలోని యాప్‌లలో కంటెంట్ కోసం సెర్చ్ చేయడానికి ఈ టెక్నాలజీ రూపొందించింది. అదనంగా, ఐఎమ్‌డీబీ రేటింగ్‌లను ముందుగా సూచించే ప్రత్యేక ఫీచర్ కూడా కలిగి ఉంది. కొత్త షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు 2జీబీ ర్యామ్‌తో అందించే అవకాశం ఉంది. కానీ, 32జీబీ స్టోరేజీని అందిస్తుంది.
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ ధర (అంచనా) :
షావోమీ రాబోయే ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలు భారత మార్కెట్లో పైన పేర్కొన్న రూ. 33వేల ధర విభాగంలో ప్రదర్శించబడతాయని భావిస్తున్నారు. స్టాండర్డ్ వేరియంట్ ధర దాదాపు 33వేలు ఉండవచ్చు. బిగ్ సైజు టీవీ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. షావోమీ ఎక్స్ ప్రో సిరీస్ ధరల రేంజ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 32,999 వద్ద అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఫీచర్ల పరంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది.