Raksha Bandhan 2024 : నిమిషానికి 700 రాఖీలు, రూ.11వేల విలువైన గిఫ్ట్స్.. బ్లింకిట్, స్విగ్గీ రక్షా బంధన్ రికార్డ్‌లివే..!

Raksha Bandhan 2024 : రక్షాబంధన్‌ వేళ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లింకిట్‌ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పండుగ చేసుకున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి.

Raksha Bandhan 2024 : నిమిషానికి 700 రాఖీలు, రూ.11వేల విలువైన గిఫ్ట్స్.. బ్లింకిట్, స్విగ్గీ రక్షా బంధన్ రికార్డ్‌లివే..!

Blinkit, Swiggy Create Records On Raksha Bandhan 2024 ( Image Source : Google )

Raksha Bandhan 2024 : రాఖీ పండగ.. రక్షాబంధన్.. అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక.. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. రాఖీలతో మార్కెట్ మొత్తం కలర్ ఫుల్‌గా మారిపోతుంటుంది. ఎక్కడా చూసినా రాఖీలకే దర్శనమిస్తుంటాయి. రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు ఆసక్తిని కనబరుస్తుంటారు. సోదరులు ఎక్కడ ఉన్నా రాఖీలు, గిఫ్ట్‌లను పంపిస్తుంటారు. ఒకప్పుడు ఎక్కడో దూరాన ఉన్న సోదరుడి కోసం వెళ్లి మరి రాఖీలు కట్టేవారు.

Read Also :  Raksha Bandhan : చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ .. వీడియో వైరల్

ఇప్పుడు ట్రెండ్ మారింది. క్విక్ కామర్స్ సంస్థల సాయంతో ఎక్కడ ఉన్నా క్షణాల వ్యవధిలో రాఖీలు, గిఫ్ట్‌లను పంపిస్తున్నారు. రక్షాబంధన్‌ వేళ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లింకిట్‌ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పండుగ చేసుకున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి. ఈ ఏడాదిలో సరికొత్త మైలురాయిని సాధించాయి. రెండు సంస్థలు తమ 2023 అమ్మకాలతో పోలిస్తే.. అధిక స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి.

బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధింద్సా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “బ్లింకిట్‌లో ఒక రోజులో ఆల్ టైమ్ హై-ఆర్డర్‌లను రెండు నిమిషాల్లో క్రాస్ చేశాం. ఈరోజు అత్యధిక ఓపీఎమ్ (నిమిషానికి ఆర్డర్‌లు), జీఎమ్‌వీ(GMV), చాక్లెట్ అమ్మకాలు, ఇతర మెట్రిక్‌లను కూడా సాధించాం. (ముఖ్యంగా మొదటి బ్లింకిట్ ఆర్డర్‌ని ఇచ్చిన వారికి) నిమిషానికి (RPM) 693 రాఖీలు ఆర్డర్లను సాధించాం”అని అన్నారు. బ్లింకిట్ సర్వీసును విశ్వసించినందుకు వినియోగదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు.. అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్‌తో సహా 6 దేశాల నుంచి ఆర్డర్‌లను వచ్చినట్టు బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధింద్సా ప్రకటించారు. రక్షా బంధన్ సందర్భంగా తమ కంపెనీ అంతర్జాతీయ మోడ్‌కు మారనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో గ్రోఫర్స్‌గా పిలిచే బ్లింకిట్‌ను దీపిందర్ గోయల్ నేతృత్వంలోని జొమాటో 2022లో ఆల్-స్టాక్ 570 మిలియన్ డాలర్ల డీల్‌లో కొనుగోలు చేసింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Instamart) కూడా అమ్మకాలలో అసాధారణమైన వృద్ధిని సాధించింది.

దీనిపై కంపెనీ సహ-వ్యవస్థాపకుడు ఫణి కిషన్ ఎక్స్ వేదికగా “రక్షా బంధన్ వేడుకలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి” అని పేర్కొన్నారు. “గరిష్ట స్థాయి కన్నా నిమిషానికి (OPM) అధిక ఆర్డర్‌లు వస్తున్నాయి. ఇదే చారిత్రాత్మకం. ఏడాది పొడవునా విక్రయించిన రాఖీలన్నింటిని ఈరోజు విక్రయించాలని భావిస్తున్నాం. ఇప్పటికే, గత ఏడాది కన్నా 5 రెట్లు ఎక్కువ” అని ఫణి కిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత ఏడాది మొత్తంతో పోలిస్తే.. @SwiggyInstamartలో ఈ ఏడాది 5రెట్లు రాఖీలను విక్రయించిట్టు తెలిపారు.

Read Also : Raksha Bandhan 2024 : తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి.. ఏ సమయంలో రక్షా బంధన్ కట్టాలో ఇక్కడ తెలుసుకోండి..