YouTube Channels Block : దేశంలో ఫేక్ న్యూస్ కట్టడికి.. మరోసారి యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఫేస్‌బుక్ అకౌంట్లపైనా నిషేధం!

YouTube Channels Block : దేశంలో జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు భారత ప్రభుత్వం కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లను మరోసారి బ్లాక్ చేసింది.

YouTube Channels Block : దేశంలో ఫేక్ న్యూస్ కట్టడికి.. మరోసారి యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఫేస్‌బుక్ అకౌంట్లపైనా నిషేధం!

YouTube Channels Block _ Indian govt blocks 8 YouTube channels for spreading fake news

Updated On : August 20, 2022 / 4:27 PM IST

YouTube Channels Block : దేశంలో జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు భారత ప్రభుత్వం కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లను మరోసారి బ్లాక్ చేసింది. సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఈసారి 8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసింది. 8 ఛానెల్స్‌లో 7 భారత్‌కు చెందినవే ఉన్నాయి. అందులో ఒకటి పాకిస్థాన్‌కు చెందినది. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లకు 114 కోట్లకు పైగా వ్యూస్, 85 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. IT రూల్స్, 2021 ప్రకారం ఆయా ఛానెల్‌లు బ్లాక్ చేసినట్టు నివేదిక తెలిపింది.

కేంద్ర మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన యూట్యూబ్ కంటెంట్.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో భారత స్నేహపూర్వక సంబంధాలు, దేశంలోని పబ్లిక్ ఆర్డర్‌కు హానికరమని గుర్తించారు. దీని ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A పరిధిలో కంటెంట్ ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లోని మత వర్గాల మధ్య విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు ఈ యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు I&B మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌లలోని వివిధ వీడియోలలో దేశానికి సంబంధించి తప్పుడు వాదనలు కూడా ఉన్నాయని గుర్తించారు.

YouTube Channels Block _ Indian govt blocks 8 YouTube channels for spreading fake news

YouTube Channels Block _ Indian govt blocks 8 YouTube channels for spreading fake news

దేశంలో మతపరమైన పండుగలు జరుపుకోవడం, మతపరమైన యుద్ధ ప్రకటనలు మొదలైనవాటిని భారత ప్రభుత్వం నిషేధించింది. అలాంటి కంటెంట్ దేశంలో మత సామరస్యాన్ని సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఐటీ మంత్రిత్వ శాఖ ఈ యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్ చేసింది. భారత సాయుధ దళాలు, జమ్మూ, కశ్మీర్ మొదలైన వివిధ విషయాలపై నకిలీ వార్తలను పోస్ట్ చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానెల్‌లను వినియోగించినట్టు గుర్తించారు.

జాతీయ భద్రత, విదేశీ రాష్ట్రాలతో భారత్ స్నేహపూర్వక సంబంధాల దృక్కోణం నుంచి కంటెంట్ పూర్తిగా అవాస్తవమని గుర్తించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంతకీ భారత్ బ్లాక్ చేసిన 8 YouTube ఛానెల్‌లలో Loktantra TV, U&V TV, AM Razvi, Gouravshali Pawan Mithilanchal, SeeTop5TH, Sarkari Update, Sab Kuch Dekho ఉన్నాయి.

పాకిస్థాన్‌లో ఉన్న ఎనిమిదవ ఛానల్ పేరు News ki Dunya ఉంది. అంతేకాదు.. అదనంగా, దేశం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఒక ఫేస్‌బుక్ అకౌంట్, రెండు ఫేస్‌బుక్ పోస్ట్‌లను కూడా బ్లాక్ చేసింది. యూట్యూబ్ ఛానెల్‌లను ప్రభుత్వం బ్లాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏప్రిల్‌లో, భారత్ 16 యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించింది.

Read Also : YouTube Channels Blocked: మరో 8 యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. 100 దాటిన సంఖ్య..