YouTube Monetization Rules : క్రియేటర్లకు బ్యాడ్ న్యూస్.. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్.. ఇకపై అలాంటి ఛానెళ్లకు డబ్బులు రావు..!
YouTube Monetization Rules : యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించే క్రియేటర్లకు బ్యాడ్ న్యూస్.. జూలై 15 తర్వాత మానిటైజేషన్ రూల్స్ మారబోతున్నాయి..

YouTube Monetization Rules
YouTube Monetization Rules : యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం (YouTube Monetization Rules) అనేవారికి నిజంగా షాకే.. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్‌లో అతిపెద్ద మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లీష్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఎఫెక్ట్ పడనుంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు..
యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య చాలా పెరిగాయి. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి తెగ అప్‌లోడ్ చేస్తున్నారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు YouTube వీటన్నింటికీ చెక్ పెట్టబోతోంది.
యూట్యూబ్ కొత్త రూల్స్ ఏంటి? :
జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే పదే అప్‌లోడ్ చేయడం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసేవారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది.
యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తోంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేసే ఛానెల్స్ సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పుడు ఇలాంటి వీడియోలకు మానిటైజేషన్ ఉండదు :
- ఒరిజినల్ వీడియోలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.
- స్వల్ప మార్పులు చేసి వేరొకరి కంటెంట్‌ను పోస్ట్ చేసేందుకు అనుమతించదు.
- యూట్యూబ్‌లో వీడియోను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
- పోస్ట్ చేసే ముందు ఇతర వీడియోలను కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది.
- ఒకే వీడియోను పదే పదే అప్‌లోడ్ చేయడం నిషేధం.
- డబ్బు కోసం ఒకే వీడియోను మళ్లీ మళ్లీ అప్‌లోడ్ చేయలేరు.
- టెంప్లేట్‌లతో కూడిన వీడియోలు, రోబోటిక్ వాయిస్‌లతో వీడియోలకు అనుమతి ఉండదు
- తప్పుడు సమాచారం లేదా ఎంటరైన్మెంట్ లేని వీడియోలు అనుమతి ఉండదు.
- ఫేస్ లేకుండా ఛానళ్లు స్పామ్ కంటెంట్ ఛానళ్లకు అనుమతి ఉండదు.
- ఎడ్యుకేషన్ లేదా ఎంటరైన్మెంట్ సంబంధించి ఏదైనా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలి.
AI జనరేటెడ్ వీడియోలు ఎఫెక్ట్ అవుతాయా? :
వాస్తవానికి, యూట్యూబ్ ఏఐ కంటెంట్‌ను స్పష్టంగా నిషేధించలేదు. కానీ, ఈ అప్‌డేట్ ఏఐ వాయిస్‌లు, అవతార్‌లు లేదా ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లపై ఎక్కువగా ఆధారపడే ఛానెల్‌లపై ఎఫెక్ట్ పడొచ్చు. హ్యుమన్ కాకుండా ఆటోమాటిక్‌గా రూపొందించిన వాయిస్, ఏఐతో జనరేట్ చేసిన వీడియోలకు కూడా ఈ కఠినమైన రూల్స్ వర్తించే అవకాశం ఉంది.
జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. కొత్త సమాచారాన్ని అందించే వీడియోలు లేదా విద్యా, కొత్తదనం, క్రియేటివిటీ, వినోదాత్మక వీడియోలు మాత్రమే అనుమతిస్తుంది. మీ కంటెంట్ ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటేనే మీరు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించగలరు.
వర్చువల్ యూట్యూబర్ల సంగతేంటి? :
యానిమేటెడ్ అవతార్‌లను ఉపయోగించే వర్చువల్ యూట్యూబర్‌లు (VTubers) ఇప్పటికీ సేఫ్‌గా ఉండవచ్చు. సొంత వాయిస్‌ఓవర్‌లు, రియల్ కంటెంట్‌ను అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది VTubers భారీ ఫాలోయింగ్‌తో లక్షలు సంపాదించారు. అయితే, ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై పూర్తిగా ఆధారపడేవారు కొత్త నిబంధనల ప్రకారం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
క్రియేటర్లు ఏం చేయాలి? :
జూలై 15 తర్వాత యూట్యూబ్ మరింత స్పష్టత ఇచ్చే వరకు క్రియేటర్లు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- ప్రత్యేకమైన, వ్యక్తిగత కంటెంట్‌పై దృష్టి పెట్టండి
- కాపీ వీడియోలు, టెంప్లేట్ ఆధారిత వీడియోలను పోస్ట్ చేయొద్దు.
- కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ టూల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
- వీడియోలకు వాల్యూ లేదా ఒరిజినాల్టీ ఉండేలా చూసుకోండి.
యూట్యూబ్ పాత రూల్ ఏంటి? :
యూట్యూబ్‌లో డబ్బు సంపాదించాలంటే గత 12 నెలల్లో 1,000 మంది సబ్‌స్క్రైబర్లు, 4,000 అవర్స్ పూర్తి అయి ఉండాలి. గత 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ పొందడానికి షార్ట్ వీడియోలు అవసరం. ఇలా పూర్తి అయిన ఛానెళ్లకు మాత్రమే మానిటైజేషన్ వస్తుంది.
గతంలో కాపీ-పేస్ట్ లేదా ఏఐ కంటెంట్ ఉపయోగించవచ్చు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ పోస్ట్ చేయవచ్చు. ఈ మార్పు వేలాది మంది కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆదాయాలను తెచ్చిపెట్టింది. కానీ, ఇకపై అలాంటి ఛానళ్లకు మానిటైజేషన్ ఉండదు.