Zomato Home Style Meals : జోమాటోలో కేవలం రూ. 89లకే ఫ్రెష్ హోమ్లీ మీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Zomato Home Style Meals : మీరు ఇంటికి దూరంగా నివసిస్తున్నారా? ఇకపై మీరు రెస్టారెంట్ల నుంచి రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో అనే ఆందోళన అక్కర్లేదు.

Zomato Home Style Meals : జోమాటోలో కేవలం రూ. 89లకే ఫ్రెష్ హోమ్లీ మీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

Zomato will start delivering freshly cooked home style meals at Rs 89 only

Updated On : February 22, 2023 / 9:48 PM IST

Zomato Home Style Meals : మీరు ఇంటికి దూరంగా నివసిస్తున్నారా? ఇకపై మీరు రెస్టారెంట్ల నుంచి రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో అనే ఆందోళన అక్కర్లేదు. రెస్టారెంట్లలో కూడా ఇంట్లో వండిన ఆహారం మాదిరిగానే ఎంతో రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జోమాటో (Zomato) రియల్ హోమ్ చెఫ్‌లు రూపొందించిన లేటెస్ట్ హోమ్లీ మీల్స్‌ను సరసమైన ధరలకు డెలివరీ చేయనున్నట్టు జోమాటో ప్రకటించింది.

ఈ కొత్త ఫీచర్ (‘Zomato Everday)’ అనే పేరుతో అందుబాటులో ఉంది. (Zomato) గతంలో రిలీజ్ చేసిన 10 నిమిషాల డెలివరీ ఫీచర్‌ను భర్తీ చేస్తుంది. (Zomato Everyday) ప్రస్తుతం గుర్గావ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. జోమాటో హోమ్ మీల్స్ ఆర్డర్ ధర రూ. 89 నుంచి ప్రారంభమవుతుంది.

‘మా ఆహార భాగస్వాముల హౌస్-చెఫ్‌లతో ప్రతి వంటకాన్ని ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. నిమిషాల్లోనే ఉత్తమ ధరలకు హోం స్టయిల్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాం. అత్యుత్తమ పదార్థాలతో రుచికరమైన భోజనాన్ని మాత్రమే కాకుండా, ప్రతి వంటకం అత్యధిక నాణ్యతతో ఉంటుంది. (Zomato)తో, ఆర్డరింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఫుడ్ మెనుని బ్రౌజ్ చేయండి. మీ భోజనాన్ని ఎంచుకోండి. కేవలం నిమిషాల్లోనే మీ ఇంటి వద్దకే వేడిగా రుచికరమైన ఆహారాన్ని డెలివరీ చేస్తామని Zomato) బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Zomato will start delivering freshly cooked home style meals at Rs 89 only

Zomato will start delivering freshly cooked home style meals at Rs 89 only

కొత్త యాడ్ చేసిన ఈ ఫీచర్ ద్వారా ఇళ్లకు దూరంగా నివసించే వినియోగదారులు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ హోటళ్ల నుంచి తినడం వల్ల అనేక కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే, Zomato సర్వీసు ద్వారా ఇంట్లో వండిన ఆహారానికి యాక్సస్ పొందవచ్చు. మీ జేబులో డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు. జొమాటో ఇంట్లో వండిన భోజనం రూ. 89 ప్రారంభ ధరకు వస్తుందని ప్రకటించింది. రైడ్-హెయిలింగ్ దిగ్గజం హోమ్-వండిన భోజనాన్ని డెలివరీ చేసేందుకు హోమ్ చెఫ్‌లతో కలిసి పనిచేసింది.

ఇంట్లో వండిన భోజనాన్ని ఆర్డర్ చేసేందుకు ఇలా చేయండి :
– మీ స్మార్ట్‌ఫోన్‌లో Zomato యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
– యాప్‌ను ఓపెన్ చేయండి.
– మెనుని బ్రౌజ్ చేయండి. Explore సెక్షన్‌కు వెళ్లండి.
– మీరు Everyday ట్యాబ్‌లో అందించిన వైడ్ రేంజ్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.
– మీ భోజనాన్ని కస్టమైజ్ చేసుకోండి.
– దాదాపు రూ. 89కి ఇంట్లో వండిన భోజనాన్ని మీకు డెలివరీ చేయండి.
– ధర డెలివరీ ఛార్జీలతో కలిపి ఉండదు.
– మీరు Zomato గోల్డ్‌ని కొనుగోలు చేస్తే.. సమీపంలోని అవుట్‌లెట్‌ల నుంచి ఆర్డర్ చేయొచ్చు.
– మీరు డెలివరీ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

జనవరి 2023లో Zomato లాయల్టీ ప్రోగ్రామ్, Zomato గోల్డ్‌ని రీస్టార్ట్ చేసింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను 3 నెలలకు రూ.149 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. వార్షిక ప్లాన్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద అనేక బెనిఫిట్స్ అందజేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also : Nothing Phone (1) Update : నథింగ్ ఫోన్ (1)లో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు పొందాలంటే ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి..!