తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1102 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా….. ఇప్పటివరకు కరోనా బారిన పడి 693 మంది మరణించారు.
గత 24 గంటల్లో కరోనాతో 1930 మంది కోలుకోగా.. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 68,126గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 234 కేసులు, కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్ మల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున కేసులు ఉన్నాయి.