తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం (జులై 21, 2020) రాష్ట్రంలో 1430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 703 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 47,705 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యారు. కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి చెందగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 429కి చేరింది.
ఇవాళ 2062 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 36,385 మంది డిశ్చార్జి అయ్యారు.
మరో 10,891 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజే 16,855మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 2,76,222 మందికి టెస్టులు చేశారు.