Telangana IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఒకేసారి 15మందికి స్థానచలనం!
Telangana IPS Transfers : తెలంగాణలో కొత్త డీజీపీగా జితేందర్‌ను ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో ఒకేసారి 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.

15 IPS Officers Transferred ( Image Source : Google )
Telangana IPS Transfers : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 15 మంది ఐపీఎస్ అధికారులను మరో చోటకు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం (జూలై 10) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో చాలామందికి కీలక బాధ్యతలను అప్పగించింది.
గతంలో రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేష్ భగవత్‌ను లా అండ్ అడిషనల్ డీజీగా నియమించింది. ప్రస్తుత రాచకొండ కమిషనర్ తరుణ్ జోషిని ఏసీబీకి బదిలీ చేసింది. వరంగల్ సీపీగా ఉన్న సుధీర్ బాబును రాచకొండ సీపీగా పదోన్నతి కల్పించింది. మిగిలిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
- హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..
- టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..
- గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..
- రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు..
- ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి..
- మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి..
- రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు..
- మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ..
- హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి..
- మెదక్ ఎస్పీగా డి.ఉదయ్ కుమార్ రెడ్డి..
- వనపర్తి ఎస్పీగా గిరిధర్..
- ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి..
- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్..
తెలంగాణలో కొత్త డీజీపీగా జితేందర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా స్థానంలో 1992 క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్‌ను తెలంగాణ డీజీపీగా నియమించింది.
Read Also : TGPSC Group Exams : తెలంగాణలో గ్రూప్ 2, గ్రూపు 3 పరీక్షలు వాయిదా పడ్డాయా? టీజీపీఎస్సీ క్లారిటీ ఇదిగో!