తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది.
ఇవాళ 1296 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 27,295 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 13,328 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 14027 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 2,22,693 మందికి టెస్టులు చేసినట్లు వెల్లడించింది.
రంగారెడ్డి 224, మేడ్చల్ 160, సంగారెడ్డి 57, ఖమ్మం 10, కామారెడ్డి 5, వరంగల్ అర్బన్ 47, వరంగల్ రూరల్ 1, కరీంనగర్ 92, జగిత్యాల 1, యాదాద్రి భువనగిరి 1, మహబూబాబాద్ 19, పెద్దపల్లి 7, మెదక్ 26, మంచిర్యాల 4, మహబూబ్ నగర్ 6, భద్రాద్రి 6, జయశంకర్ భూపాలపల్లి 8 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
నల్గొండ 64, రాజన్నసిరిసిల్ల 3, నారాయణపేట 7, వికారాబాద్ 8, నాగర్ కర్నూలు 30,
జనగాం 1, నిజామాబాద్ 20, వనపర్తి 21, సిద్దిపేట 5, సూర్యపేట 20, జోగులాంబ గద్వాల 5 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.