Integrated Bed
Integrated BEd : ఇంటర్మీడియట్ చదువుతోనే టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించాలనే అభ్యర్థులకు శుభవార్త. ఇకపై ఇంటర్ ముగియగానే నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. ఈమేరకు జాతీయ విద్య విధానంలో నూతనంగా పొందుపరచిన నాలుగేళ్ళ బీఎడ్ కోర్సు డిసెంబర్ 24 నుంచి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారే బీఈడీ చదివే వీలుండగా, ఇకపై ఇంటర్ పూర్తైన వారు బీఈడీ చదివే అవకాశం ఉంది.
చదవండి : Telangana : ప్రభుత్వంపై బీజేపీ పగపట్టింది.. మంత్రులనే అవమానిస్తారా..?
తెలంగాణలోని నారాయపేట జిల్లా కేంద్రంలో ఉన్న “శ్రీదత్త బృందావన్ ఇంస్టిట్యూట్ అఫ్ టీచర్ ఎడ్యుకేషన్”… ఆయా కోర్సులు అందించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పాలమూరు విశ్వవిద్యాలయం అఫిలియేట్ గా…బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ.. కోర్సులు శ్రీదత్త బృందావన్ ఇంస్టిట్యూట్ అందించనుంది. ఒక్కో కోర్సులో 100 సీట్లు ఉంటాయి.
చదవండి : Telangana Paddy Issue : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఫైర్
ఇంటర్ విద్యార్హత ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్న ఈ కోర్సులకు… డిసెంబర్ 24 నుంచి 29 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు www.edcetadmin.tsche.ac.in/intbed వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి సీట్ల కేటాయింపు, జనవరి 10 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.