మరిచిపోలేని బహుమతి : ఆర్మీ డే వేడుకల్లో చిన్నారి

మరిచిపోలేని బహుమతి : ఆర్మీ డే వేడుకల్లో చిన్నారి

Updated On : January 16, 2021 / 10:11 AM IST

ఓ చిన్నారికి మరిచిపోలేని బహుమతి లభించింది. ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఆ చిన్నారి కన్న కలలను ప్రధాన మంత్రి కార్యాలయం నెరవేర్చింది. ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించడంతో చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఆర్మీ డే, వెటరన్స్ డే వేడుకలకు ఆర్మీ అధికారులు చిన్నారిని ఆహ్వానించడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సికిందరాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ నగరానికి చెందిన సమీర్ పాత్ర, వర్ష పాత్రల కుమార్తె న్యోరా పాత్ర. ఆర్మీ అంటే ఎంతో అభిమానం. ఆర్మీ దుస్తులు ధరించుకుని తనకు తాను సైనికురాలు అంటూ ఊహించుకొనేది. ఆర్మీకి సంబంధించి పెయిటింగ్ లు వేస్తూ..గడిపేది. తాను ఆర్మీ వారిని కలుసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పేది. దీంతో ప్రధాన మంత్రి కార్యాలయానికి ఈమెయిల్స్, లేఖలు రాశారు. ఇండిపెండెంట్ డే లేదా..రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని వారు కోరుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

pmo office

పీఎంవో ఆదేశాల మేరకు..శుక్రవారం ఆర్మీ డే, వెటరన్స్ డే వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాల్సిందిగా న్యోరాకు ఆహ్వానం పంపారు. దీంతో న్యోరా, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కల్నల్ ర్యాంకు అధికారి, ఇద్దరు సోల్జర్స్ ఆధ్వర్యంలో న్యోరాకు భద్రత కల్పిస్తూ..ఆమెను సికిందరాబాద్ లోని వీరుల సైనిక స్మారం వార్ మెమోరియల్ కు తీసుకొచ్చారు. అప్యాయ పలకరింపులు, ఆమెతో ఫొటోలు దిగుతూ..మరింత ఉత్సాహపరిచడంతో సైనిక దుస్తులు ధరించిన న్యోరా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా న్యోరాతో కలిసి ఆర్మీ ఉన్నతాధికారులు అమరవీరులకు సైనిక వందనం సమర్పించారు.