Miss World: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. 120 దేశాల నుంచి అందమైన అమ్మాయిలు.. పూర్తి వివరాలు..

మిస్ వరల్డ్ పోటీ గురించి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ వివరాలు తెలిపారు.

Miss World: గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. 120 దేశాల నుంచి అందమైన అమ్మాయిలు.. పూర్తి వివరాలు..

Updated On : February 19, 2025 / 9:01 PM IST

మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ ప్రారంభ వేడుకతో పాటు ముగింపు వేడుకలు, గ్రాండ్‌ ఫినాలే నిర్వహిస్తారు. మొత్తం 120 దేశాల నుంచి అమ్మాయిలు పాల్గొననున్నారు.

మిస్ వరల్డ్ పోటీ గురించి మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ అధికారిక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా మోర్లీ మాట్లాడుతూ.. గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రంగా తెలంగాణను వర్ణించారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం ప్రపంచ వీక్షకులకు ఈ రాష్ట్ర గొప్ప వారసత్వం, వృద్ధిని చూపుతుందని చెప్పారు. తెలంగాణ మిస్ వరల్డ్ 2025కి ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని సభర్వాల్ చెప్పారు.

తెలంగాణలో ప్రతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. మిస్‌ వరల్డ్‌ ప్రారంభ వేడుకతో తెలంగాణ గొప్పదనం గురించి ప్రపంచానికి మరింత తెలుస్తుందని చెప్పారు.

మిస్ వరల్డ్ 120కి పైగా దేశాల నుంచి యువతులను ఒకచోట చేర్చుతుందని ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం మాత్రమే కాకుండా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. అనేక దేశాల ప్రతినిధులు మే 7న తెలంగాణకు వస్తారని అన్నారు.