Telangana new corona cases : తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 2,61,728కి చేరాయి. ఇప్పటివరకు 1,423 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 20, 2020) బులిటెన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో 1,057 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 2,47,790 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 12,515 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 10,245 మంది హో ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
https://10tv.in/haryana-minister-anil-vij-to-take-trial-dose-of-covaxin-tomorrow/
ఒక్కరోజులో 39,448 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 50,50,612 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.