Pranaam Hospitals : ప్రణామ్ హాస్పిటల్స్‌ అరుదైన వైద్య ఘనత.. 8.5 కిలోల అండాశయ ట్యూమర్ విజయవంతంగా తొలగింపు..

ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయడానికి అనేక విభాగాల మధ్య సమన్వయం, ఖచ్చితమైన ప్రణాళిక అవసరమైంది.

Pranaam Hospitals : ప్రణామ్ హాస్పిటల్స్‌ అరుదైన వైద్య ఘనత.. 8.5 కిలోల అండాశయ ట్యూమర్ విజయవంతంగా తొలగింపు..

Updated On : May 4, 2025 / 8:57 PM IST

Pranaam Hospitals : హైదరాబాద్ లోని ప్రణామ్ హాస్పిటల్స్ శస్త్రచికిత్సా బృందం మరో వైద్య మైలురాయిని అధిగమించింది. మధ్య వయస్సు మహిళకు 8.5 కిలోల భారీ అండాశయ ట్యూమర్‌ను (కణితి) విజయవంతంగా తొలగించి ఆమె ప్రాణాలను కాపాడింది. తద్వారా ప్రణామ్ హాస్పిటల్స్ తన అధునాతన వైద్య సేవల్లో విశేష ఘనతను సాధించింది.

మహిళ గత కొన్ని నెలలుగా తీవ్రమైన పొట్ట నొప్పితో బాధపడుతోంది. ఊబకాయం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో రోగాన్ని కనుగొనేందుకు ఆమెకు సమగ్ర పరీక్షలు, ఇమేజింగ్ చేశారు. కడుపులో పెద్ద అండాశయ కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ట్యూమర్ పరిమాణం చాలా పెద్దగా ఉంది. దీంతో శస్త్రచికిత్స కష్టతరంగా మారింది. వైద్యుల బృందానికి ఇదొక పెద్ద సవాల్ గా మారింది. కానీ, అన్ని సవాళ్లను అధిగమించి సర్జికల్ బృందం ట్యూమర్ ను తొలగించడంలో సక్సెస్ అయ్యింది.

ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయడానికి అనేక విభాగాల మధ్య సమన్వయం, కచ్చితమైన ప్రణాళిక అవసరమైంది. గైనకాలజీ ఆంకాలజిస్టులు, అనస్తీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు, శస్త్రచికిత్స బృందం సమిష్టిగా సహకరించి, ఆపరేషన్ సమయంలో ఎటువంటి ప్రతికూలతలు లేకుండా జాగ్రత్త పడింది. శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

Also Read: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అండాశయ ట్యూమర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యంగా గుర్తిస్తే, చాలా పెద్దవిగా మారి ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. ఈ విషయంలో ఆరోగ్య పరీక్షలు, ముందు జాగ్రత్తగా తీసుకునే వైద్యం ఎంత ముఖ్యమో ఈ కేసే నిదర్శనం. క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేసి ప్రాణాలను కాపాడినందుకు, చికిత్స ప్రక్రియ మొత్తం సమయంలో చూపిన ప్రేమాభిమానానికి, జీవితాన్ని తిరిగి అందించినందుకు, రోగి కుటుంబ సభ్యులు ప్రణామ్ హాస్పిటల్స్‌కి, వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రణామ్ హాస్పిటల్స్ గురించి:
ప్రణామ్ హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, రోగి కేంద్రిత సేవలతో పేరుగాంచిన వైద్య సంస్థ. ఈ ఆస్పత్రిలో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు ఉన్నాయి. ఏ రోగానికి ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపై పూర్తి పరిజ్ఞానం ఉన్న డాక్టర్లు ఉన్నారు. ఎన్నో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతం చేసింది. సమగ్ర ఆరోగ్య పరిరక్షణలోనూ ప్రణామ్ హాస్పిటల్స్ ఎల్లప్పుడూ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.