ACB Raids : హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉమాహేశ్వరరావు పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి

ACB Raids : హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు

CCS ACP Uma Maheshwara Rao

Updated On : May 21, 2024 / 2:55 PM IST

ACB Raids On CCS ACP Uma Maheshwara Rao : సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉమాహేశ్వరరావు పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని ఆరు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమమహేశ్వరరావు ఉన్నారు. అశోక్ నగర్ లోని ఉమామహేశ్వరరావు ఇంట్లో, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

Also Read : రేవ్ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలవారే.. ఒక నటి కూడా ఉన్నారు : బెంగళూరు సిటీ సీపీ బి. దయానంద్

ఉమాహేశ్వరరావు గతంలోనూ అనేక చోట్ల పనిచేసిన నేపథ్యంలో ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో అనేకసార్లు సస్పెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన క్రమంలో ఉమాహేశ్వరరావుపై కొంతకాలంగా నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు.. మంగళవారం తెల్లవారు జాము నుంచి ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు అతని స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

Also Read : CM Revanth Reddy : కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి