CM Revanth Reddy : కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

CM Revanth Reddy : కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : May 21, 2024 / 2:27 PM IST

CM Revanth Reddy to Visit Tirumala : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల వెళ్లనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి తిరుమల బయలుదేరుతారు. రేపు (బుధవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి రానున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తిరుమల పర్యటనతో ఇవాళ రేవంత్ రెడ్డి పలు శాఖలపై నిర్వహించాల్సిన సమీక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దయినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Also Read : తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరెవరు?

ఇదిలాఉంటే తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు జారీ పున: ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కారణంగా గత నెల నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీ నిలిచిపోయింది. సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తిరిగి వీఐపీల సిఫారసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. బోర్డు సభ్యులకు గతంలో మాదిరిగానే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ. 300 ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫారసు లేఖలపై జారీ చేస్తున్నారు.