Hyderabad : అఫ్ఘాన్ ఎఫెక్ట్.. పెరగనున్న హైదరాబాద్ బిర్యానీ రేట్..?

ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు..రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Hyderabad : అఫ్ఘాన్ ఎఫెక్ట్.. పెరగనున్న హైదరాబాద్ బిర్యానీ రేట్..?

Biryani

Updated On : August 20, 2021 / 1:43 PM IST

Afghan Crisis : బిర్యానీ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. మహానగరంలో తయారు చేసే బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఇక్కడి బిర్యానీపై మనస్సు పారేసుకుంటుంటారు. హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు..బిర్యానీ తినకుండా ఉండలేరు. అయితే..ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు..రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనకంతంటికీ కారణం అప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం కారణమంటున్నారు.

Read More : Third Umpire Mistake: రనౌట్ కోరితే.. స్క్రీన్‌పై మ్యూజిక్ షేర్ చేసిన థర్డ్ అంపైర

అప్ఘాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న సంగతి తెలిసిందే. బిర్యానీలో ఉపయోగించే వంటసామాగ్రీలో మసాల కీలకం. డ్రైఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పు, అల్మండ్, ఎండుద్రాక్షలు బిర్యానీ తయారీలో ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో అధికభాగం అప్ఘానిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. అప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా…ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. ఇదే పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే..డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫలితంగా వీటి ధరలు పెరగవచ్చని అనుకుంటున్నారు.

Read More : Marrying With Trees : చెట్లతో పెళ్ళి… అపై రొమాన్స్

దీంతో దీని ఎఫెక్ట్ బిర్యానీపై పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడితే..బిర్యానీ రుచిలో కూడా మార్పు వచ్చే సూచనలున్నాయని వెల్లడిస్తున్నారు. ఇప్పటికప్పుడు డ్రై ఫ్రూట్స్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఎందుకంటే..కొంతమంది అప్ఘాన్ వ్యాపారులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీరు భారీ ఎత్తున అప్ఘాన్ నుంచి తెప్పించి హైదరాబాద్ లో ఉన్న కొన్ని హోటల్స్ కు సరఫరా చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే హోటల్స్ కళకళలాడుతున్నాయని, తాలిబన్ల కారణంగా…బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని కొన్ని ప్రముఖ హోటల్స్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో చూడాలి.