KC Venugopal Fired Revanth Reddy : భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్.. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కనీసం ఒక్క హోర్డింగ్ కానీ ఎలాంటి ప్రచారం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KC Venugopal Fired Revanth Reddy : భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్.. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

Updated On : October 14, 2022 / 8:44 AM IST

KC Venugopal Fired Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల విషయంలో ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. కనీసం ఒక్క హోర్డింగ్ కానీ ఎలాంటి ప్రచారం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐ యామ్ సారీ రేవంత్’ అంటూ ఫైర్ అయ్యారు.

‘నీకు నీవు బాగా ప్రచారం చేసుకుంటావనే పేరుంది.. భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నావు. యాత్రకు సంబంధించి ఇప్పటివరకు వర్క్ డివిజన్ ఎందుకు చేయలేదు’ అని నిలదీశారు. టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను భారత్ జోడో పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని వేణుగోపాల్ ఆదేశించారు. పీసీసీ ఛాంబర్ లో అంతర్గత సమావేశంలో సైతం.. పీసీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Revanth Criticized CM KCR : మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ : రేవంత్ రెడ్డి

కాగా, మునుగోడు విషయంలో సీనియర్లు సహకరించడం లేదని రేవంత్ ఫిర్యాదు చేశారు. చాలా మంది అక్కడ అడుగు కూడా పెట్టలేదని పేర్కొన్నారు. అందరినీ కో-ఆర్డినేషన్ చేసుకునే బాధ్యత పీసీసీగా నీపై ఉంటుందని రేవంత్ ను ఉద్దేశించి వేణుగోపాల్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.