Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికెట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు.

Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?

All India Forward Bloc symbol impact in united Karimnagar district politics

All India Forward Bloc symbol: ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోయినా.. సింబల్ మాత్రం పవర్ పుల్‌. ఆ సింబల్ మీద ఎవరూ పోటి చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్. అందుకే ఆ పార్టీ సింబల్‌కు ప్రతి ఎన్నికల్లో డిమాండ్ పెరుగుతోంది. ఆ పార్టీ సింబల్ చూస్తేనే ప్రచారంలో జోష్ పెరగడమే కాదు.. అభ్యర్థులు సింహంలా పోరాడుతున్నట్లుగానే భావిస్తుంటారు. రెబల్స్‌కు (Rebels) ఆశ్రయం ఇస్తున్న ఆ పార్టీ ఏంటి? దాని గుర్తు ఏంటి?

సింహం గుర్తు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (united karimnagar district) రాజకీయాలను గర్జిస్తోంది. అంతేకాదు ప్రధాన రాజకీయ పార్టీలను సైతం భయపెట్టిస్తోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోయినప్పటికి.. సింహం సింబల్ ఆ పార్టీకి క్రేజ్‌నిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికెట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు. సింహం ధైర్యానికి.. సాహసానికి మారు పేరుగా చెప్పుకుంటారు. ప్రధాన రాజకీయ పార్టీలను వీడి ధైర్యం చేసేవారు సింహంలా పోరాడుతున్న అనే సంకేతాలను ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. గెలిచినా ఓడినా సింహంలా బతుకు అనేది రాజకీయ నాయకులు చివరగా చెప్తున్నా సారాంశం.

ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ బాగానే ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1939 మే 3న ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు సుభాష్ చంద్రబోస్. ఒకప్పుడు బెంగాల్‌లో సిపిఎం తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నప్పటికి కాలక్రమేనా పార్టీ జనదరణకు దూరమైంది. ఇప్పుడు తెలంగాణలో రెబల్స్ కి కేరాఫ్‌గా మారుతోంది.

Also Read: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

గత ఎన్నికల్లో ఫార్వార్డ్ బ్లాక్‌ పార్టీ తరుపున రామగుండం నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ (Korukanti Chandar) విజయం సాధించారు. చాలా చోట్ల రెబల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం.. క్యాడర్ లేకపోయినప్పటికి ఆ పార్టీ సింబల్ పై మాత్రం జనాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ చరిత్ర తెలియకపోయినప్పటికి.. చాలా మంది గుర్తు కోసం మాత్రం పోటీపడుతుంటారు. సింహం సింబల్‌పై గెలిచి ఎన్నికలయ్యాక ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఈసారి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింహం సింబల్‌ ఆశావహులను ఆదుకోనుంది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో సింహం టిక్కెట్ పై పోటి చేసే వారు ఎంతమంది విజయం సాధిస్తారో.

Also Read: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ? కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల