YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ? కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల

తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ? కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల

YS Sharmila

YS Sharmila meets Sonia Gandhi: తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం‌చేస్తే ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ కేంద్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది. షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ విషయంపై పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో షర్మిల చర్చించినట్లు తెలిసింది. తాజాగా షర్మిల దంపతులు సోనియాగాంధీ, రాహుల్‌తో భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం ఖాయమైందన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది.

YS Sharmila : పోలీసులకు హారతి ఇచ్చిన వైఎస్ షర్మిల .. శ్రావణ శుక్రవారం రోజు వినూత్న ఘటన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ వంటి నేతలతో షర్మిల పలుసార్లు భేటీ అయ్యారు. అయితే, షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనికితోడు షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లోకి రావడాన్ని కొందరు కాంగ్రెస్ పార్టీ  నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి వెళితేనే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. అయితే, షర్మిల మాత్రం అందుకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలుసైతం షర్మిల నిర్ణయానికి అంగీకారం తెలిపారని, ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్ టీపీ విలీనంపై చర్చించేందుకు చివరిగా గురువారం సోనియాగాంధీతో భేటీ అయ్యారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే వైెస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

YS Sharmila : ఢిల్లీలో షర్మిల, కాంగ్రెస్‌లో విలీనం కానున్న వైఎస్ఆర్టిపీ.. ముహూర్తం ఫిక్స్!?

షర్మిల కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? పార్టీని విలీనం చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి వచ్చింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ‌తో చర్చల సమయంలో ఈ రెండు అంశాలను షర్మిల ప్రస్తావించారని సమాచారం. సోనియా, రాహుల్‌తో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ కావడం జరిగిందని తెలిపారు. వారితో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు నిరంతరం పనిచేస్తానని, కేసీఆర్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని షర్మిల వ్యాఖ్యానించారు.