YS Sharmila : పోలీసులకు హారతి ఇచ్చిన వైఎస్ షర్మిల .. శ్రావణ శుక్రవారం రోజు వినూత్న ఘటన

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులకు హారతి ఇచ్చారు. ఈరోజు శ్రావణ శుక్రవారం. హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులకు షర్మిల హారతి ఇచ్చారు.

YS Sharmila : పోలీసులకు హారతి ఇచ్చిన వైఎస్ షర్మిల .. శ్రావణ శుక్రవారం రోజు వినూత్న ఘటన

YS Sharmila

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులకు హారతి ఇచ్చారు. ఈరోజు శ్రావణ శుక్రవారం. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోలీసులకు షర్మిల హారతి ఇచ్చారు. అదేంటీ షర్మిల ఏంటీ పోలీసులకు హారతి ఇవ్వటమేంటీ..? అనే డౌట్ రావచ్చు. అసలు విషయం ఏమిటంటే..

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళితబంధు పథకంలో అవినీతి జరిగిందని షర్మిల పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయటమే కాకుండా ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అక్రమాలు జరిగాయని..తమ ఎమ్మెల్యేలే దళిత బంధు నిధులను స్వాహా చేస్తున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని..అయినా వారిపై చర్యలు తీసుకోలేదు అంటూ షర్మిల విమర్శించిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోనే జయదేవ్ పూర్ మండలంలోని తీగుల్ లో దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో షర్మిల తీగుల్ వెళ్లి బాధితులను కలిసేందుకు రెడీ అయ్యారు. కానీ తీగుల్ కు వెళ్లకుండా షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు ఆమె నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆమెను బయటకు పోనీయకుండా అడ్డుకున్నారు. ఆమె పోలీసులను దాటుకుని బయటకు వెళ్లేందుకు యత్నిస్తే హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో షర్మిల పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకు హారతి ఇచ్చి తన నిరసనను వినూత్నంగా వ్యక్తంచేశారు.

కాగా గతంలో కూడా షర్మిలను బయటకు వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు ఆమెకు తీవ్ర వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలో షర్మి పోలీసులపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు.