My Home SAYUK Inauguration: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘మైహోమ్ సయుక్’.. బ్రోచర్‌ను ప్రారంభించిన అల్లు అర్జున్

హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ ను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు.

My Home SAYUK Inauguration: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘మైహోమ్ సయుక్’.. బ్రోచర్‌ను ప్రారంభించిన అల్లు అర్జున్

My Home (6)

Updated On : June 9, 2022 / 1:26 PM IST

My Home SAYUK Inauguration: హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ ను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. గురువారం జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మైహోం సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు, ఎండి జూపల్లి శ్యామ్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అల్లు అర్జున్ ‘మైహోమ్ సయుక్’ ప్రాజెక్ట్ బ్రోచర్ ను ఆవిష్కరించి, 3డి వాక్ త్రూ లాంచ్ ను అల్లు అర్జున్ లాంచ్ చేశారు.

My Home (7)

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మైహోమ్ సంస్థ ఏర్పాటై 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్నసందర్భంగా సంస్థ యాజమాన్యంకు, సంస్థలో పనిచేసే ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. రానున్న కాలంలోనూ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ కస్టమర్ల మనస్సులు మరింత గెలుచుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. మైహోమ్స్ సంస్థ నుంచి నిర్మాణం జరిగే ప్రాజెక్టులు ఎంతో నాణ్యతతో ఉంటాయని అన్నారు. మాదాపూర్ లో సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులో తాను ఓ ప్లాట్ తీసుకున్నానని, లోపలికి వెళితే దుబాయ్, సింగపూర్ వెళ్లినట్లుగా అక్కడి వాతావరణం ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు. మైహోమ్ సంస్థ నుంచి వస్తున్న మరోనూతన ప్రాజెక్ట్ మైహోమ్ సయుక్ ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టుల కంటే కూడా గొప్పగా ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు. ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ రోజే వెయ్యి ప్లాట్లు బుక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

My Home (8)

మైహోమ్ గ్రూప్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మైహోమ్ సయుక్ ప్రాజెక్ట్ నిర్మింస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, సౌకర్యాల విషయంలో ఏ మాత్రం రాజీపడలేదని అన్నారు. ఇటీవలే తన సంస్థకు అంతర్జాతీయ స్థాయి పురస్కారం సైతం అందినట్లు తెలిపారు. మైహోమ్ సంస్థపై కస్టమర్లలో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా మైహోమ్ సయుక్ ఉంటుందని రామేశ్వరరావు తెలిపారు.

My Home (9)

మైహోం సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. చైర్మన్ రామేశ్వరరావు ఆద్వర్యంలో మైహోమ్ సంస్థ నాణ్యత, నమ్మకానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. 35 సంవత్సరాలుగా దిగ్విజయంగా సంస్థ కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 15వేలకుపైగా కుటుంబాలు మైహోమ్ సంస్థలో నిర్మించిన ప్రాజెక్టుల్లో భాగస్వాములు అయ్యారని, మైహోమ్ సయుక్ తో ఆ సంఖ్య 20వేలకు క్రాస్ అవుతుందని అన్నారు. సంస్థ ఆద్వర్యంలో 2016లో మైహోమ్ అవతార్ ప్రాజెక్ట్ చేపట్టామని, ప్రాజెక్టు ప్రారంభం రోజే హైదరాబాద్ లో ఎప్పుడూలేనంతగా రికార్డు స్థాయిలో  ప్లాట్లు సేల్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం మైహోమ్ సయుక్ ప్రాజెక్టుకూడా అదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు జూపల్లి రాము రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి జూపల్లి శ్యామ్ రావు, ప్రతిమ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

My Home (10)