Earthquake In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6 గా నమోదు

సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళారం తెల్లవారుజామున 3.20 గంటలకు కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 

earthquake

Earthquake In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళారం తెల్లవారుజామున 3.20 గంటలకు కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.  రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ పేర్కొంది.

Earthquake In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో స్వల్ప భూకంపం

నల్గొండకు 117 కిలో మీటర్ల దూరంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందు గతేడాది జనవరిలోనూ కోహీర్ మండలంలో పల్లు చోట్ల భూకంపం సంభవించింది.