Road Accident Two Died : వైద్య పరీక్షలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. బాలింత, వృద్ధుడు దుర్మరణం

మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వైద్య పరీక్షలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలింత, వృద్ధుడు దుర్మరణం చెందారు. ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది.

Road Accident Two Died : వైద్య పరీక్షలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. బాలింత, వృద్ధుడు దుర్మరణం

ACCIDENT

Updated On : December 24, 2022 / 7:56 AM IST

Road Accident Two Died : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వైద్య పరీక్షలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలింత, వృద్ధుడు దుర్మరణం చెందారు. ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాలింత, వృద్ధుడు మృతి చెందారు. కుమురంభీ అసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం చేద్వాయి గ్రామానికి చెందిన వృద్ధుడు పోషన్న, అతని మనుమరాలు, బాలింత సువర్ణ వైద్య పరీక్షల కోసం ఆటోలో ఆస్పత్రికి వెళ్లారు.

వైద్య పరీక్షలు ముగించుకుని తిరిగి వస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలోని పోలంపల్లి స్టేజీ దగ్గరకు రాగానే ఆటోను పత్తి లోడ్ తో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు పోషన్న అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన బాలింత సువర్ణను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయారు.

Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, 20 రోజుల కిత్రమే సువర్ణ డెలివరీ అయింది. పండంటి ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ ప్రమాదం నుంచి 20 రోజుల చిన్నారితోపాటు మరో మూడేళ్ల కూతురు ప్రాణాలతో బయటపడ్డారు.